ప్రస్తుతం తెలుగు సిని ఇండస్ట్రీలో రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది.దీంతో టాలీవుడ్ లో అగ్ర హీరోలతో పాటు స్టార్ హీరోలో కూడా రీమేక్ ల సినిమాలలో నటిస్తున్నారు.
మెగా హీరోలు అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ రీమేక్ ల సినిమాలలోనే నటిస్తున్నారు.ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం సాధించలేకపోయింది.
మామూలుగా ఒకసారి హీరో సినిమా హిట్ టాక్ వచ్చి రివ్యూ రేటింగ్ లు అంతా బాగుంటే కలెక్షన్లు కూడా బాగానే ఉండాలి.
కానీ భీమ్లా నాయక్ సినిమాకు మాత్రం పరవాలేదు అనిపించేలా కలెక్షన్స్ వచ్చాయి.అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
హెచ్చుటకును అందుకోవడంతో పాటు రివ్యూ రేటింగ్ లు కూడా బాగానే వచ్చాయి.కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
మరి ఈ విధంగా స్టార్ హీరోలు అయినా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ల సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనకబడుతున్నాయి.అనుకున్న విధంగా కలెక్షన్స్ సాధించలేకపోతున్నాయి.

వసూళ్ల రికార్డుల సృష్టించడం గురించి పక్కన పెడితే కనీస స్థాయి వసూళ్లను కూడా అందుకోవడం కష్టంగా మారింది.అయితే ఇందుకు గల కారణం రీమేక్ ల ఫలితం అని చెప్పవచ్చు.గాడ్ ఫాదర్ భీమ్లా నాయక్ సినిమాలకు ఎంత కొత్తగా రంగులు దిద్దినప్పటికీ అవి రెండు కూడా రీమేక్ సినిమాలే.ఈ సినిమా కోసం దర్శకులు, నిర్మాతలు ఎంత కష్టపడినప్పటికీ రీమేక్ అన్న మాత్రం విశ్వసింప చేయలేరు.
ఇలా రీమేక్లు ఎన్ని చేసినప్పటికీ ఒరిజినల్ ప్రభావాన్ని ఈ సినిమాలోని అదిగమించలేకపోతున్నాయి.అయితే ఈ రీమేక్ ల విషయంలో అభిమానులు హీరోలకు హెచ్చరించినప్పటికీ హీరోలు రీమేక్ సినిమాల తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
రీమేక్ సినిమాలతో ఫలితాలు సో సో గా ఉంటుండడంతో అభిమానులు బ్రదర్స్ కు వార్నింగ్ బెల్స్ కొడుతున్నారు.కాగా మెగా హీరోల చేతిలో తదుపరి సినిమాలు కూడా రీమేక్ లే ఉండటం గమనార్హం.
మరి ఇప్పటికైనా మెగా హీరోలు రీమేక్ సినిమాలను పక్కనపెట్టి కొత్త కంటెంట్లతో ముందుకు వస్తారో లేదో చూడాలి మరి.