శనివారం రోజున తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైన కాంతార మూవీ యునానిమస్ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.ఒక్కరోజులోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా ఈ సినిమా రెండు రోజుల్లో ఏకంగా 11.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.వీక్ డేస్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఫుల్ రన్ లో ఈ సినిమా 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి.
స్టార్ హీరోలు సైతం షాకయ్యే రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటించగా సప్తమీ గౌడ హీరోయిన్ గా నటించారు.
రిషబ్ శెట్టి కొన్ని సన్నివేశాల్లో అద్భుతమైన అభినయంతో మెప్పించి ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.ఈ సినిమా 4.87 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.కాంతార సినిమాకు టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
ప్రభాస్, అనుష్క ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించిన నేపథ్యంలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

హోంబులే ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించడం గమనార్హం.ఈ బ్యానర్ లోనే సలార్ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ సినిమా కోసం నిర్మాతలు భారీ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు.

కాంతార సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే పది నుంచి పన్నెండు రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.మంచి కంటెంట్ తో సినిమాలను తెరకెక్కిస్తే బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవడం సాధ్యమేనని కాంతార సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.ఈ సినిమా సక్సెస్ తో మరోమారు కన్నడ సినీ ఇండస్ట్రీ పేరు మారుమ్రోగుతోంది.