నిత్యం గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే మీరీ టీ తాగాల్సిందే!

గ్యాస్, ఎసిడిటీ.( Gas, Acidity, ).

 Power Tea For Avoiding Gas And Acidity! Digestion Tea, Tea, Latest News, Gas, Ac-TeluguStop.com

దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొనే ఉంటారు.అయితే ఇవి ఎప్పుడో ఒకసారి వస్తే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు.

కానీ కొందరు నిత్యం వీటితో సతమతం అవుతుంటారు.టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు ప్రధాన కారణాలు.

కడుపు ఎప్పుడు నిండుగా ఉండటం, కడుపులో మంట వీటి లక్షణాలు.ఇక గ్యాస్, ఎసిడిటీ వల్ల ఏం తినాలన్నా భయపడుతుంటారు.

ఈ రెండిటి నుంచి బయటపడేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే టీ మీ డైట్ లో ఉండాల్సిందే.ఈ టీను నిత్యం ఒక కప్పు చొప్పున తీసుకుంటే ఆయా జీర్ణ సమస్యలన్నీ పరారవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు చెక్ పెట్టే ఆ టీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Acidity, Tea, Tips, Latest-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు( Coriander ) వ‌న్ టేబుల్ స్పూన్ సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర,( Cumin Seeds ) రెండు దంచిన మిరియాలు వేసి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ పే ఫిల్టర్ చేసుకుంటే మన టీ సిద్ధం అయినట్టే.

ఈ టీను ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత తీసుకోండి.

Telugu Acidity, Tea, Tips, Latest-Telugu Health

నిత్యం ఈ టీ తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది.దాంతో మీరు తినే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.ఫలితంగా గ్యాస్ ఎసిడిటీ సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మరియు మలబద్ధకం సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.కాబట్టి ఎవరైతే గ్యాస్ ఎసిడిటీ సమస్యలతో ప్రతిరోజు బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ టీను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

పైగా ఈ టీ ను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ కరుగుతుంది.మోకాళ్ళ నొప్పుల( Knee pain ) నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఒత్తిడి డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube