ఐఐటీయన్స్‌ కంటే ఎక్కువ ప్యాకేజీలు అందుకుంటున్న నిట్, ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు!

ఈ రోజుల్లో ఐఐటీయన్స్‌ కంటే ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీ( NIT, IIIT ) విద్యార్థులందరూ అన్నింటా ముందుకు దూసుకెళ్తున్నారు.వీరు చాలా ప్రతిభతో గొప్ప విజయాలు సాధిస్తున్నారు.

 Campus Placements, National Institutes Of Technology, Nit, Indian Institute Of I-TeluguStop.com

ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తూ ఐఐటీకి వెళ్లకపోయినా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి జీతంతో గొప్ప ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుందని చూపిస్తున్నారు.రీసెంట్ టైమ్‌లో హైయ్యెస్ట్ ప్యాకేజీ అందుకున్న వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Allahabad, Amazon, Campus, Engineers, Iiit-Latest News - Telugu

ఐఐఐటీ అలహాబాద్‌లో బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన పాలక్ మిట్టల్( Palak Mittal ) అమెజాన్‌లో రూ.1 కోటి యాన్యువల్ ప్యాకేజీతో ఉద్యోగం చేజిక్కించుకున్నారు.ఆమె బెర్లిన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా 2022 ఆగస్టులో చేరారు.2022లో ఐఐఐటీ అలహాబాద్‌లో బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన అనురాగ్ మకాడే అమెజాన్‌లో రూ.1.25 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించారు.అతను డబ్లిన్‌లో ఫ్రంటెండ్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తారు.

Telugu Allahabad, Amazon, Campus, Engineers, Iiit-Latest News - Telugu

ఐఐఐటీ అలహాబాద్‌లో ఎంటెక్ గ్రాడ్యుయేట్( IIIT Allahabad ) అయిన ప్రథమ్ ప్రకాష్ గుప్తా( Prakash Gupta ) రూ.1.4 కోట్ల ప్యాకేజీతో గూగుల్‌లో ఉద్యోగం సంపాదించారు.అతను లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తాడు.ఎన్ఐటీ పాట్నాలో B.Tech గ్రాడ్యుయేట్ అయిన అభిషేక్ కుమార్ అమెజాన్‌లో రూ.1.8 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు.అతను జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తారు.ఎన్ఐటీ పాట్నా నుంచి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్ అయిన అదితి తివారీ, 1.6 కోట్ల ప్యాకేజీతో ఫేస్‌బుక్‌లో ఉద్యోగం సంపాదించారు.ఆమె యునైటెడ్ స్టేట్స్‌లో ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్‌గా పని చేస్తుంది.మొత్తం మీద ఎక్కువ శాలరీలు పొందడానికి, ప్రతిభను నిరూపించుకోవడానికి ఐఐటీ కాలేజీలు మాత్రమే ఆధారం కాదని వీరు నిరూపించారు.

ఎన్‌ఐటీ, త్రిబుల్ ఐటీలలో కూడా చదువుకొని ఎవరికైనా సరే పోటీ ఇవ్వచ్చని చెప్పకనే చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube