ఇపుడున్న టారిఫ్ ప్లాన్లతో ఒక్క సిమ్ కార్డు( Sim Card )ని మెంటైన్ చేయడమే సామాన్యులకి కష్టంగా మారుతోంది.అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా వందల సంఖ్యలో సిమ్ కార్డ్స్ తీసుకుని వాడిపారేస్తున్నాడు.
ఈతంతు మరెక్కడో కాదు, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది.విజయవాడలోని గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు ఉన్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ అధికారులు విజయవాడ సీపీ కాంతిరాణాకు ఫిర్యాదు చేయగా సూర్యారావుపేట పోలీసులకు సీపీ కాంతిరాణా విచారణ చేయాలని ఆదేశించడం జరిగింది.
ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అవును, ఆ విషయం తెలుసుకొని పోలీసులు అవాక్కయ్యారు.ఒకే ఫొటోతో ఓ నెట్‌వర్క్ సంస్థకు చెందిన 658 సిమ్( 658 Sim Cards )లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.దీనిపై దర్యాప్తు చేపట్టగా సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ సిమ్ కార్డులని రిజిస్టర్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇదే తరహాలో అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా మరో 150 వరకు నకిలీ పత్రాలతో సిమ్‌కార్డులు అమ్మినట్లు పోలీసులు కనుగొన్నారు.సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలికమ్యునికేషన్ల శాఖ( Telecommunication Office ) ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఓ టూల్ కిట్ తీసుకురాగా దాని ద్వారా ఈ మోసం బయటపడింది.
కాగా ఒకే ఫొటోతో జారీ అయిన ఈ సిమ్‌కార్డులు ఎక్కడికి వెళుతున్నాయి? వాటిని ఎవరు వాడుతున్నారు? ఎందుకోసం వాడుతున్నారు అనే దానిపై పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఏఎస్‌టీఆర్ సాఫ్ట్‌వేర్( ICTR Software ) ద్వారా సిమ్‌కార్డు మోసాలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్ గుర్తించి.సంబంధిత నంబర్లను బ్లాక్ చేస్తున్నారు.నకిలీ పత్రాలతో జారీ చేసిన సిమ్‌కార్డులు అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే పరిస్థితి వేరేగా ఉంటుందని డిపార్ట్మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.
సిమ్ కార్డులపై డాట్ పరిమితి విధించింది.ఒక వినియోగదారుడి పేరు మీద 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులుంటే మళ్లీ వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదేశించింది.