నిన్నే పెళ్లాడతా వంటి సినిమా ఘన విజయం సాధించడం తో యమ జోరు మీద ఉన్నాడు నాగార్జున.అప్పుడు అతడొక గ్రీకు వీరుడు, అమ్మాయి ల గుండెల్లో మన్మధుడు.
చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది అమ్మాయిలు తమ గ్రీకు వీరుడిని వెతుక్కునే పనిలో ఉన్నారు.అలంటి సమయంలో సరిగ్గా దర్శకేంద్రుడు కె.
రాఘవేంద్రరావు గారికి మెదడులో ఎలాంటి పురుగు తిరిగిందో తెలియదు కానీ నాగార్జునను ఒక రొమాంటిక్ హీరో నుంచి అన్నమయ్య గా చూపించాలని అనుకున్నారు.శ్రీ తాళ్ళపాక అన్నమయ్య అనే ఒక అపార భక్తుడు.
ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు ఎంతో మంది హీరోలు ఉండగా ఆయనకు నాగార్జున మాత్రమే ఎందుకు కనిపించారు అనేది ఒక వెయ్యి డాలర్ల ప్రశ్న.
వాస్తవానికి శ్రీ తాళ్ళపాక అన్నమయ్య జీవిత చరిత్ర దర్శకుడు వందకు వెయ్యి శాతం న్యాయం చేసాడు.
అందులో ఎలాంటి అనుమానం లేదు.ఎటొచ్చి ఈ సీనియాలో కొత్త విషయం ఒక్క నాగార్జున మాత్రమే.
ఎందుకంటే అప్పటి వరకు నాగార్జున చేసిన సినిమాలు వేరు.ఆయనకు ఉన్న ఇమేజ్ వేరు, జీవించిన జీవితం కూడా పూర్తిగా విరుద్ధం.
ఈ సినిమా ఒక నటుడిగా నిజమైన చఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి.ఇక ఈ సినిమా రాబోతుంది అని తెల్సిన సినిమా పండితులు ఎవరికి నచ్చిన జోష్యం వారు చెప్పడం మొదలు పెట్టారు.
నాగార్జున డేట్స్ ఇవ్వడం ఏంటి ఈ సినిమా తీయడం ఏంటి అంటూ పెదవి విరిచారు.
ఒక వేళా తీసిన రీలు , టైం, డబ్బు అన్ని వేస్ట్ అంటూ పెదవి విరిచారు.అప్పటికే నిన్నే పెళ్లాడతా ఎంతో రొమాంటిక్ సినిమాగా హిట్ అయ్యి ఒక శివ, ఒక గీతాంజలి రేంజ్ లో ఆయనకు పేరు తీసుకచ్చింది.అంతే కాక కొత్త కథలను, కొత్త దర్శకులను ముందుడి నడిపించడం లో అయన ఎప్పుడు ముందు ఉంటారు.
అన్నమయ్య సినిమా కన్నా ముందు రాముడొచ్చాడు, వజ్రం వంటి సినిమాలు రావడం తో ఆ సినిమాలను అన్నమయ్యతో పోల్చి చూసి చాల చులకనగా మాట్లాడారు.కానీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అయ్యాక అందరి నోళ్లకు మూతలు పడ్డాయి.
ఇక ఈ సినిమాకు యస్పీ బాలసుబ్రహ్మణ్యం, భారవి, రాఘవేంద్రరావు, నాగార్జున, కీరవాణి నిజమైన మూల స్తంభాలు .