సాధారణంగా కొందరికి ముఖ చర్మం పై మొండి మచ్చలు ఏర్పడుతుంటాయి.ఈ మచ్చలు ఓ పట్టాన పోవు.
చర్మం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్నా సరే అక్కడక్కడ కనిపించే ముదురు రంగు మచ్చలు మొత్తం అందాన్ని పాడుచేస్తాయి.మీరు కూడా మొండి మచ్చలతో బాధపడుతున్నారా.? వాటిని వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ హోమ్ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే.
ఈ రెమెడీతో చాలా ఈజీగా మొండి మచ్చలకు గుడ్ బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి ఉడికించాలి.
దాదాపు 15 నిమిషాల పాటు ఉడికిస్తే వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జెల్ ను ఫ్రిడ్జ్ లో దాదాపు పది రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వేపాకుల పొడి( Neem Powder ) వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజల ( Flax seeds)జెల్ మరియు వన్ టేబుల్ స్పూను పెరుగు వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక ట్రై చేస్తే ముఖ చర్మం పై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా కూడా క్రమంగా మాయం అవుతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.ముడతలు మాయం అవుతాయి చర్మం కాంతివంతంగా సైతం మెరుస్తుంది.