డెలివరీ అనంతరం ప్రతి మహిళా సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో రక్తహీనత ఒకటి.ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువగా జరగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
అయితే రక్తహీనతను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.పొరపాటున చేశారా.
ఆ ప్రభావం తల్లితో పాటు బిడ్డపై కూడా పడుతుంది.అందుకే రక్తహీనతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే డెలివరీ తర్వాత మదన పెట్టే రక్తహీనతకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని తొక్క తొలగించి వాటర్ లో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక చిన్న ఆపిల్ ని తీసుకుని వాటర్ లో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మరియు నీటిలో శుభ్రంగా కడిగిన రెండు ఉసిరికాయలు కూడా తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు, ఉసిరి ముక్కలు పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మూడు లేదా నాలుగు వాల్ నట్స్ మరియు ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తద్వారా యాపిల్ బీట్ రూట్ ఆమ్లా జ్యూస్ సిద్ధమవుతుంది.
ఈ జ్యూస్‌ను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.ప్రతిరోజు ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే శరీరానికి ఐరన్ పుష్కలంగా అందుతుంది.
దీంతో హిమోగ్లోబిన్ శాతం పెరిగి.రక్తహీనత సమస్య దూరమవుతుంది.
పైగా ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు.కాబట్టి డెలివరీ తర్వాత ప్రతి మహిళ ఖచ్చితంగా ఈ జ్యూస్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.