సోమవారం ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు.ఈ రోజు శివుణ్ణి పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.
సోమవారం ఉదయం శివాలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో స్వామివారికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.అందుకే ఆ పరమశివున్నీ అభిషేక ప్రియుడు అని కూడా అంటారు.
అయితే ముఖ్యంగా కన్యారాశి వారు మరకత లింగాన్ని సోమవారం పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
కన్యారాశి వారు మరకత లింగాన్ని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి.
కన్యారాశి వారికి అధిపతి బుధుడు.బుధుడు బుధవారానికి అధిపతి.
అందువల్ల కన్యారాశి వారు బుధవారం ఎలాంటి శుభ కార్యాలు చేసిన ఎటు వంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి.అదే విధంగా ఈ రాశి వారు సోమవారం మరకత లింగాన్ని పూజించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
బుధుడుకి ప్రీతికరమైన రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి కన్యారాశి వారు ఆకుపచ్చ రంగులో ఉన్న మరకత లింగాన్ని పూజించడం ద్వారా వారి జీవితంలో ఎలాంటి ఒడి దుడుకులు లేకుండా సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.అంతే కాకుండా రాయితో మరకత లింగాన్ని తయారు చేయించి, ఇంట్లో పూజించుకోవచ్చు.అయితే ఒక గ్లాసులో పాలు పోసి మరకత లింగాన్ని ఉంచి పాలు మొత్తం ఆకుపచ్చ రంగులోకి వచ్చే వరకు పూజించాలి.
అదే విధంగా ఈ మరకత లింగాన్ని నీటిలో ఉంచి పూజించిన కూడా ఆ నీరు ఆకుపచ్చరంగులో మారుతాయి.
ఈ లింగాన్ని పూజించడం ద్వారా విద్య, ఉన్నత పదవుల్లో రాణిస్తారు.అంతేకాకుండా దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా సమస్త దోషాలు తొలగిపోతాయి.ఈ మరకత లింగానికి పాలతో అభిషేకం చేయడం ద్వారా జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.