కొన్నిసార్లు మనకు తెలియకుండానే చేసే తప్పులు భారీ నష్టాన్ని మిగులుస్తాయి.కొన్నిసార్లు అవి అనైతికం అయితే మరికొన్నిసార్లు అహేతుకం కూడా అవుతుంటాయి.
అలాంటి ఒక సంఘటన టైటానిక్ షిప్ కి జరిగింది.ఎప్పుడూ నౌకలు వెళ్లి వచ్చే మార్గమే అయినా కూడా టైటానిక్ మునగబోతుంది అంటూ చేసిన సంకేతాలను ఎవరు అందుకోలేదా.? అందుకున్న కిమ్మక ఉండిపోయారా ? మనకేం అవసరంలే అనుకున్నారా ? లేదా ఇంకా ఏదైనా రహస్యం ఉందా ? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
టైటానిక్ షిప్ మునిగిన రోజు దాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో మూడు నౌకలు ఉన్నాయి.
అవి మూడు కూడా టైటానిక్ మునగబోతోంది అనే సంకేతాలను అందుకున్నాయి.రేడియోలో వారి కేకలను, అరుపులను విన్నారు.
మొదటి టైటానిక్ షిప్ టైటానిక్ కి అతి దగ్గరలో అంటే కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఆ నౌక పేరు శాంప్సన్… టైటానిక్ షిప్ నుంచి సంకేతాలు అందిస్తూ, వాళ్ళు చేస్తున్న ఆహాకారాలను వింటూ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఈ నౌక.కారణం వారి దగ్గర ఉన్న అక్రమ సీల్స్ రవాణా.దొరికితే అరెస్ట్ అవుతాం అని భయపడి ఇంత పెద్ద నౌక మునిగిపోతుంటే సహాయం చేయకుండా వెళ్ళిపోయారు.
ఈ నౌక వారి దగ్గరకు వెళ్ళి ఉంటే టైటానిక్ లో ఉన్న అందరినీ కాపాడేది.అత్యంత హెయంగా వదిలేసి వెళ్ళిపోయింది.

ఇక రెండో నౌక పేరు కాలిఫోర్నియా.14 కిలోమీటర్ల దూరంలో ఉంది.అది కూడా టైటానిక్ మునగబోతున్న విషయం తెలుసుకుంది.కానీ అడ్డుగా మంచు తెరలు ఉన్నాయి.తెల్లారక చూద్దాం, ఇప్పుడు మనకు వచ్చిన బాధ ఏంటి.పోతే వాళ్లే పోతారులే అనుకోని ఆ కెప్టెన్ లాంతరు ఆపేసి మరి సహాయం అందించకుండా ఉండిపోయాడు.
ఇక మూడవ నౌక పేరు కార్పాతియా.ఇది 58 మైళ్ళ దూరంలో ఉంది.ఆ కెప్టెన్ కూడా రేడియోలో సంకేతాలను విన్నాడు.అతను వెళుతున్న మార్గము కాదు.ఆ కెప్టెన్ కి వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు.కానీ అతడు ఆరోజు హీరో… వెనక్కి తిరిగి వచ్చాడు.మంచు శిఖరాలను దుసుకుంటు టైటానిక్ ని చేరాడు.705 మందిని తన నౌక లో ఎక్కించుకొని తీరానికి చేర్చాడు.దమ్మున్న క్యాప్టెన్.చరిత్రలో నిలిచిపోయాడు.పోయిన ప్రాణాలను కాకుండా బ్రతికిన కొంత మందిని తీరానికి చేర్చి ఆరోజు ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేశారు.ఇక ఈ నౌక జర్మనీ చేతుల్లో మూడు దశాబ్దాల తర్వాత ముంచేయబడింది.
అది మరొక కథ .మళ్ళీ తెలుసుకుందాం.