నైట్ నిద్రించే ముందు ఈ టీ తాగితే.. మలబద్దకం ప‌రార్ అవ్వాల్సిందే!

మలబద్దకం(కాన్స్టిపేషన్).పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రో తీవ్రంగా మ‌ద‌న పెట్టే అత్యంత సాధారణ జీర్ణ సమస్య ఇది.ఫైబ‌ర్ ఫుడ్‌ను స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, ప‌లు ర‌కాల మంద‌ల వాడ‌కం, తగినంత నీరు త్రాగకపోవడం, ఒత్తిడి వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య వేధిస్తుంటుంది.దాంతో స‌మ‌స్య‌ను ఎవ‌రితోనూ షేర్ చేసుకోలేక‌.

 If You Drink This Tea Before Going To Sleep At Night, Constipation Will Go Away!-TeluguStop.com

ఎలా నివారించుకోవాలో అర్థంగాక తీవ్రంగా స‌త‌మ‌తం అవుతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇక‌పై అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే టీను నైట్ నిద్రించే ముందు తాగితే.

మీ మ‌ల‌బ‌ద్ధ‌కం ప‌రార్ అవ్వ‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ టీ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ధ‌నియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని పొడి చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే.అందులో ధ‌నియాలు, సోంపు మ‌రియు దాల్చిన చెక్క పొడి వేసి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.

బాగా మ‌రిగించాక‌.స్ట్రైన‌ర్ సాయంతో టీను ఫిల్ట‌ర్ చేసుకుని రుచికి స‌రిప‌డా ప‌టిక బెల్లం పొడి క‌లిపి తీసుకోవాలి.

మ‌ధుమేహం వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారు మాత్రం ప‌టిక బెల్లం పొడిని ఎవైడ్ చేయ‌వ‌చ్చు.ప్ర‌తి రోజు నైట్ నిద్రించ‌డానికి అర‌గంట‌ ముందు ఈ టీని గ‌నుక తీసుకుంటే.

జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారి.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య క్ర‌మంగా దూరం అవుతుంది.

మ‌రియు గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి ఇత‌ర జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు సైతం త‌ర‌చూ ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube