కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడి, హార్మోన్ చేంజెస్ తదితర కారణాల వల్ల మొటిమలు తరచూ వేధిస్తూనే ఉంటాయి.అయితే కొందరికి మొటిమలు తగ్గిపోయినా.
వాటి తాలూకు మచ్చలు మాత్రం అంత త్వరగా తగ్గవు.ఈ మచ్చలు సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
ఈ క్రమంలోనే ఆ మచ్చలను వదిలించుకోవడం కోసం చాలా మంది ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు.
కానీ ఇంట్లోనే చాలా సులభంగా మొటిమలు తాలూకు మచ్చులను వదిలించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ మాస్‌గా సూపర్ గా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ మాస్క్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ ను పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో నాలుగు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము వేసి కరిగించి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లం సిరప్ ను వేసుకోవాలి.
అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ జెలటిన్ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో పెట్టి డబుల్ బాయిలర్ మెథడ్ లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనెను కలిపితే మ్యాజికల్ మాస్క్ సిద్ధమైనట్టే.

ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసి ఇరవై ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం సున్నితంగా మాస్క్ ను తొలగించాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే మొటిమల తాలూకు మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
అలాగే చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ సైతం తొలగిపోయి ముఖం ఫ్రెష్ గా మరియు షైనీగా మారుతుంది.ఈ న్యాచురల్ మాస్క్ ను వాడటం వల్ల ఇన్స్టెంట్ ఫేస్ గ్లోను సైతం పొందొచ్చు.