తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఫిబ్రవరి 22, మంగళవారం, మాఘమాసం , 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 22 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.16

రాహుకాలం:ఉ.3.00 ల4.30

అమృత ఘడియలు: షష్టి సామాన్యం సా.5.00ల7.00

దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఇతరులతో అనవసరమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

వృషభం:

ఈరోజు మీరు ఇతరులతో వాదనలకు దిగుతారు.అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని బాగా వృధా చేస్తారు.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వగలరు.మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపిస్తారు.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తవుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

అను కోకుండా మీ ఇంటికి నూతన వ్యక్తులు వస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు సమయాన్ని బాగా వృధా చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి వాదనలకు దిగుతారు.విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారులు పెట్టుబడిలో లాభాలు అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.ప్రతి ఒక్క విషయంలో జీవిత భాగస్వామి మీకు ధైర్యం ఇస్తుంది.సంతానం నుండి శుభవార్త వింటారు.పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు దూరప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త విషయాలు తెలుసు కుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండటం మంచిది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించాలి.గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన దానివల్ల నిరాశ చెందాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధగా ఉండాలి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.సంతానం నుండి శుభవార్త వింటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube