తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్ లలో కూడా ఒకరు.
తెలుగు, హిందీ, తమిళ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.మొదట ఒక లైలా కోసం అనే సినిమాతో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
టాలీవుడ్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తన కంటూ ఒక ఏర్పరచుకుంది.పూజా హెగ్డే నటించిన సినిమాలలో రెండు సినిమాలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి చేసింది.
అందులో ఒకటి అరవింద సమేత వీర రాఘవ, మరొకటి అల వైకుంఠపురంలో.ఈ రెండు సినిమాల విజయం తర్వాత పూజా హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది.
మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు.పూజా హెగ్డేతో పాటు శ్రీలీల మహేష్‌కు జంటగా నటిస్తోంది.అయితే, ఇద్దరు హీరోయిన్ల విషయంలో పూజా హెగ్డే అసంతృప్తితో ఉంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ విషయంలో అలిగింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

తనతో పాటు మరో హీరోయిన్‌కు సమానమైన స్థానం కల్పించటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.ప్రస్తుతం పూజా హెగ్డే వరుస ప్లాపుల్లో ఉన్న విషయం తెలిసిందే.పూజా నటించిన దాదాపు 4 సినిమాలు ప్లాప్‌లుగా నిలిచాయి.హిందీలో నటించిన సర్కస్, ప్యాన్ ఇండియా సినిమా రాథే శ్యామ్, మెగా మల్లీస్టారర్ ఆచార్య, తమిళ సినిమా బీస్ట్‌లు ప్లాప్ అయ్యాయి.
వరుస ప్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న పూజ.మహేష్ 28 సినిమా పైనే ఆశలు పెట్టుకుంది.

ఈ సినిమా హిట్ అయితే, ఆ క్రెడిట్ హీరోయిన్‌గా తనకు దక్కుతుందని భావించింది.అయితే, తనతో పాటు శ్రీలీలను కూడా హీరోయిన్‌గా అది కూడా సెకండ్ హీరోయిన్‌గా కాకుండా మెయిన్ హీరోయిన్‌గా తీసుకోవటంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ ఇద్దరు హీరోయిన్లకు సమానంగా వెళుతుంది.ఇదే పూజా హెగ్డేకు నచ్చటం లేదంట.తనతో పాటు ఇంకో హీరోయిన్‌ను ప్రాజెక్టులోకి తీసుకోవటంతో ఆమె త్రివిక్రమ్‌పై అలిగింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మేరకు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.