వారసత్వం అనేది అన్ని రంగాల్లో ఉంటుంది.ముఖ్యంగా సినీ రంగంలో అయితే తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని అప్పుడు వారిని వెండితెరకు పరిచయం చేస్తారు.
మరి ఇలా వారసులుగా వచ్చి స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.మరి ఇప్పుడు మహేష్ వారసురాలు కూడా ఇండస్ట్రీకి పరిచయం అవడానికి సిద్ధం అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని తండ్రి సినిమాతోనే అడుగు పెట్టబోతోంది.ఇప్పటికే తన తండ్రితో కలిసి సర్కారు వారి పాట సినిమాలో ఒక సాంగ్ లో కనిపించింది.
ఆ సాంగ్ కేవలం ప్రొమోషనల్ గా మాత్రమే ఉపయోగించారు.ఇక ఈసారి మాత్రం సినిమాలోనే భాగం కానుంది అని తెలుస్తుంది.
మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసారు.
ఇక ఒకటి రెండు రోజుల్లో సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.మొన్నటి నుండి ఈ సినిమాలో సితార కనిపించబోతుంది అనే న్యూస్ బయటకు వచ్చి నెట్టింట వైరల్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఈమె పాత్ర గురించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ సినిమాలో ఒక పాప పాత్ర ఉందని.ఆ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలవనుందని.ఆ పాత్ర చుట్టూనే ఈ సినిమా కథ నడుస్తుంది అంట తెలుస్తుంది.
ఈ పాపను కాపాడేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉండనున్నాయట.మరి ఆ పాత్రలోనే సితార నటించ బోతుంది అని తెలుస్తుంది.
మరి మంచి పాత్రతో ఈమె ఎంట్రీ ఇవ్వబోవడంతో ఎలా యాక్టింగ్ చేయబోతుందా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఎలాగైతేనేం అభిమానుల కోరిక తీరింది.త్రివిక్రమ్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.