ధనుష్ ఐశ్వర్య కలిస్తే బాగుంటుందని అభిమానులలో చాలామంది కోరుకుంటున్నారు.చాలా సంవత్సరాల పాటు అన్యోన్యంగా జీవనం సాగించిన ధనుష్ ఐశ్వర్య ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు చాలామంది దగ్గర సమాధానం లేదు.
ధనుష్ ఐశ్వర్య కలవబోతున్నారని వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయని తాజాగా వార్తలు ప్రచారంలోకి రాగా చాలామంది ఆ వార్తలను నిజమేనని నమ్మారు.
అయితే ధనుష్ సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ధనుష్ ఐశ్వర్య కలిసే అవకాశం లేదని వెల్లడించారు.
అయితే తాజాగా ధనుష్ తండ్రి మాట్లాడుతూ ధనుష్ కు అతని పిల్లల సంతోషమే ముఖ్యం అని చెప్పుకొచ్చారు.పిల్లలు కోరుకుంటే మాత్రం ధనుష్, ఐశ్వర్య కలిసే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
రాబోయే రోజుల్లో ధనుష్, ఐశ్వర్య కలుస్తారేమో చూడాల్సి ఉంది.
ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సార్ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.డిసెంబర్ నెల 2వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
గతేడాది అఖండ సినిమా విడుదలైన సమయంలోనే ఈ ఏడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమాతో ధనుష్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.
తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాతో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ధనుష్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.సినిమాసినిమాకు ధనుష్ రెమ్యునరేషన్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ధనుష్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.స్టార్ హీరో ధనుష్ తో సినిమాలను తెరకెక్కించడానికి టాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపుతున్నారు.







