ఒకప్పుడు ఐ బ్రోస్ ( I Bros )సన్నగా ఉండటం ఫ్యాషన్.కానీ ఇప్పుడు ఒత్తుగా కనిపించడమే ట్రెండ్ అయిపోయింది.
అందుకే మగువలు తమ ఐ బ్రోస్ ను ఒత్తుగా పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే కొందరిలో ఐ బ్రోస్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు.
దీని వల్ల ఐబ్రోస్ చాలా పల్చగా కనిపిస్తాయి.పల్చటి ఐబ్రోస్ ను పెన్సిల్ తో కవర్ చేస్తూ ఉంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ ఇంటి చిట్కాలను కనుక పాటిస్తే సహజంగానే మీ ఐబ్రోస్ ఒత్తుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతాయి.
టిప్-1:
ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్డు పచ్చసొన( Egg yolk ) మరియు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ఐబ్రోస్ కు రెండు మూడు సార్లు బాగా అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగా తరచూ చేస్తూ ఉంటే ఐబ్రోస్ ఒత్తుగా మారతాయి.
టిప్-2:
ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఉల్లిపాయ జ్యూస్( Onion juice ), వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard oil ) వేసి బాగా మిక్స్ చేసి ఐ బ్రోస్ కి అప్లై చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ చిట్కాను కనుక పాటిస్తే ఐ బ్రోస్ ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతాయి.
టిప్ 3:
ఐ బ్రోస్ ఎదుగుదలకు అలోవెరా కూడా మద్దతు ఇస్తుంది.రోజు ఉదయం మరియు సాయంత్రం ఫ్రెష్ అలోవెరా జెల్ ను తీసుకుని ఐబ్రోస్ కి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగా చేసినా కూడా ఐబ్రోస్ ఒత్తుగా పెరుగుతాయి.