మన శరీరంలో ఎముకలు కీలక పాత్రను పోషిస్తాయి.ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే బాడీ స్ట్రాంగ్ గా, హెల్తీగా ఉంటుంది.
కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది ఎముకల బలహీనతతో( bone weakness ) బాధపడుతున్నారు.వయసు పైబడిన వారిలోనే కాదు వయసులో ఉన్న వారిలో కూడా బోన్స్ వీక్ నెస్ కనిపిస్తోంది.
పోషకాలు కొరత ఇందుకు ప్రధాన కారణం.అయితే ఇప్పుడు చెప్పబోయే లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే ఎముకల బలహీనత అన్న మాటే అనరు.
మరి ఇంతకీ ఆ లడ్డూ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం( Cup of almonds ) పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో అరకప్పు ఓట్స్ ( Oats )మరియు పావు కప్పు నువ్వులను విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.ఇవి చల్లారే లోపు మిక్సీ జార్ తీసుకొని అందులో పది నుంచి పన్నెండు గింజ తొలగించిన సాఫ్ట్ ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేయించి పెట్టుకున్న బాదం పలుకులు, ఓట్స్, నువ్వులు( Oats, sesame seeds ) మరియు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ఓట్స్ బాదం లడ్డూ తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది.అలాగే అనేక పోషకాలను కలిగి ఉంటుంది.
నిత్యం ఈ లడ్డూను తింటే ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా అందుతాయి.ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.ఎముకల బలహీనత దూరం అవుతుంది.

బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చుకోవాలని భావిస్తున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న లడ్డూను డైట్ లో చేర్చుకోండి.పైగా నిత్యం ఈ లడ్డూను తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.రక్తహీనత దరి చేరకుండా ఉంటుంది.
అతి ఆకలి దూరం అవుతుంది.జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.
మరియు ఈ లడ్డూ ఎనర్జీ బూస్టర్ గా సైతం పనిచేస్తుంది.