ఇటీవల రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్, శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, చెడు వ్యసనాలు, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల ఎంతో మంది అధిక బరువు ( overweight )సమస్యతో బాధపడుతున్నారు.శరీర బరువు అదుపు తప్పడం వల్ల అనేక రోగాలు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
బాడీ షేప్ అవుట్ అవుతుంది.ఇందుకు తోడు చుట్టూ ఉన్న వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ మరింత బాధను కలిగిస్తాయి.
ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ట్రై చేస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ( Herbal tea ) ఒక వరం అని చెప్పుకోవచ్చు.నెల రోజుల పాటు ఈ హెర్బల్ టీ తాగితే ఎంత లావుగా ఉన్నవారైనా నాజూగ్గా మారతారు.టీ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక నాలుగు డ్రై మందారం పువ్వులు( Dry hibiscus flowers ) వేసుకోవాలి.అలాగే అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ), మూడు లెమన్ స్లైసెస్ వేసి పది నుంచి పన్నెండు నిమిషాలు పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తయారు చేసుకున్న టీ ని ఫిల్టర్ చేసుకుని ఒక టీ స్పూన్ తేనె కలిపి సేవించాలి.ప్రతిరోజు ఉదయం ఈ హెర్బల్ టీ తాగితే జీవక్రియ రేటు పెరుగుతుంది.దాంతో కేలరీలు మరింత వేగంగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.అధిక బరువుతో బాధపడుతూ నాజూగ్గా మారాలని భావిస్తున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హెర్బల్ టీను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.పైగా ఈ టీను నిత్యం తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది.అలాగే ఈ హెర్బల్ టీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
పొట్ట కొవ్వును సైతం కరిగిస్తుంది.