స్పీడ్ పెంచుతున్న షర్మిల .. నేటి నుంచే కీలక నిర్ణయాలు అమలు 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ( YS Sharmila’s party ) పరంగా స్పీడ్ పెంచుతున్నారు.వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ( Congress )ను ఏపీలో అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో షర్మిల ఉన్నారు.

 Sharmila, Who Is Increasing Speed, Will Implement Key Decisions From Today, Tdp,-TeluguStop.com

  దానికి అనుగుణంగానే వ్యూహాలను రచిస్తున్నారు.ఈ మేరకు అనేక కీలక నిర్ణయాలను నేటి నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఈరోజు నుంచి ఈనెల 28వ తేదీ వరకు విజయవాడలోని షర్మిల మకాం వేయనున్నారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై జిల్లా అధ్యక్షులు,  నియోజకవర్గ మండల స్థాయి నేతలతో షర్మిల స్వయంగా సమీక్షలు నిర్వహిస్తారు.

  అలాగే ఈరోజు మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.  2029 నాటికి ఏపీలో కాంగ్రెస్ బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చే దిశగా షర్మిల కసురత్తు చేస్తున్నారు.

Telugu Ap Congress, Ap, Janasena, Sharmila, Speed, Key, Ysrcp-Politics

ఈనెల 28న అరకు,  విజయనగరం , విశాఖపట్నం,  అనకాపల్లి జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.ఈనెల 26న తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా,  పశ్చిమగోదావరి జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.ఈనెల 27న ఏలూరు,  మచిలీపట్నం , విజయవాడ,  గుంటూరు జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.ఈనెల 28 న నంద్యాల,  కర్నూలు,  ఒంగోలు , నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.

నవంబర్ 6న బాపట్ల,  నరసాపురం,  అనంతపురం,  హిందూపురం జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.నవంబర్ 7న కడప , రాజంపేట,  తిరుపతి చిత్తూరు జిల్లా నేతలతో షర్మిల సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించింది.

Telugu Ap Congress, Ap, Janasena, Sharmila, Speed, Key, Ysrcp-Politics

గత కొంతకాలంగా ఏపీలో తన అన్న వైసీపీ అధినేత జగన్ ( YCP chief Jagan )ను టార్గెట్ చేసుకునే షర్మిల విమర్శలు చేస్తూనే వస్తున్నారు ఎన్నికలతో ముందు ఆ తరువాత షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకోవడం, గత వైసిపి ప్రభుత్వం లోని లోపాలను ఇప్పటికీ ఎత్తి చూపిస్తూ ఉండడంతో కూటమి పార్టీలైన టిడిపి ,జనసేన,  బిజెపి లకు అనుకూలంగా షర్మిల మారిపోయారని , అందుకే ఒక్క వైసీపీని మాత్రమే టార్గెట్ చేసుకునే విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు షర్మిలపై విమర్శలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకునే విధంగానూ షర్మిల ముందుకు వెళ్లనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube