తెల్ల జుట్టు( white hair ).ఆడ మగ అనే తేడా లేకుండా చాలా మందిని కలవరపెట్టే కామన్ సమస్య ఇది.
తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.అందుకే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు డైయింగ్ చేయించుకుంటూ ఉంటారు.
అయితే దీనివల్ల కొందరికి తీవ్రమైన తలనొప్పి( headache ) వస్తుంటుంది.మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
వాటన్నిటికీ దూరంగా ఉండటం కోసం తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవాలని పలువురు భావిస్తుంటారు.అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక కొన్ని దానిమ్మ తొక్కలు, అరటి తొక్కలు( Pomegranate peels, banana peels ) వేసుకోవాలి.
అలాగే రెండు రెబ్బలు కరివేపాకు, రెండు టేబుల్ మెంతులు( fenugreek ), రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్ తురుము( beet root ), వన్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసి ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్( Henna powder ), రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్ మరియు సరిపడా తయారు చేసి పెట్టుకున్న వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసి గంట పాటు పక్కన పెట్టుకోవాలి.ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.పది రోజులకు ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ను కనుక వేసుకుంటే తెల్ల జుట్టుకు బై బై చెప్పవచ్చు.ఈ ప్యాక్ సహజంగానే తెల్ల వెంట్రుకలను నల్లగా మారుస్తుంది.వైట్ హెయిర్ ప్రాబ్లం ను దూరం చేస్తుంది.అలాగే ఈ ప్యాక్ జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా మారుస్తుంది.