పిల్లల్లో ఊబకాయం సమస్యకు చెక్ పెట్టండి...!

ప్రస్తుత కాలంలో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాటిలో ఊబకాయం సమస్య ఒకటి.ఇది కేవలం పెద్దవారిలో మాత్రమే అనుకుంటే పొరపాటే… రోజు రోజుకి మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఈ ఊబకాయ సమస్య ఎక్కువగా కనపడుతోంది.

 Check The Obesity In Childrens  Check ,obesity ,children , Kids, Obesity Problem-TeluguStop.com

ఇక ఈ సమస్య కొరకు ప్రోబయోటిక్స్ ను ఉపయోగించి చిన్న పిల్లల్లో ఊబకాయం సమస్యకు చెక్ పెట్టవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇకపోతే ప్రోబయోటిక్స్ ఆహారపదార్థాల వల్ల అనేక ప్రయోజనాలు మనకు చేకూరుతాయి.

ఇందులో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా మానవ శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి.వీటి వలన మన జీవక్రియ, జీర్ణక్రియ రెండు మెరుగుపడి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

వీటితో పాటు శరీరంలోని ఏవైనా అలర్జీ వంటి రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ ప్రోబయోటిక్స్ ఎక్కువగా మనకి పచ్చళ్ళు, పాలు, పెరుగు, బట్టర్ లాంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తాయి.

ఇక తాజాగా కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం మేరకు ఈ ప్రోబయోటిక్స్ వలన అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని నిర్ధారణ జరిగింది.

వీటి ఉపయోగం కారణంగా చిన్న పిల్లలలో చాలా తక్కువ మందికి వచ్చే ఊబకాయం లాంటి సమస్యలను అతి సులువుగా ఎదుర్కోవచ్చు అని తేల్చారు.

ఇందుకు సంబంధించి శాస్త్రవేత్తలు 6 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలపై పరిశోధనలు చేయగా అందులో తెలియజేశారు.ఇందుకు సంబంధించి మితమైన ఆహారం ఇవ్వడం తో పాటుగా ప్రోబయోటిక్స్ వారి ఆహారంలో అందజేశారు.

వీటిని ఇవ్వడం ద్వారా పిల్లల శరీరంలో జీవక్రియ రేటు శక్తివంతంగా మారి చిన్న వయసులో ఊబకాయం పొందిన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.అంతేకాక వీటివల్ల ఏమైనా డయాబెటిస్, గుండెపోటు లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని పరిశోధకులు తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube