ఈ వేసవిలో మామిడిపండు తినాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి.ఏడాది మొత్తంలో మామిడి దొరికే సమయమే ఇది.
ఇప్పుడు తినకపోతే, పండ్ల రారాజుని రుచి చూసే భాగ్యం మళ్ళీ సంవత్సరం దాకా దొరకదని ఈ సీజన్ లో ఎగబడి ఎగబడి మామిడి తింటారు జనాలు.రోజుకి నాలుగైదు మామిడిపండ్లు తినడానికి కూడా పెద్దగా సందేహించరు.
మరి ఇంతలా తినడం కరెక్టేనా అంటే కాదు అని అంటున్నారు డాక్టర్లు.ఎందుకంటే మామిడిలో షుగర్ కంటెంట్ ఎక్కువ.
అతిగా ఆరగించకూడదు.
మరి షుగర్ పేషెంట్స్ పరిస్థితి ఏంటి ? నార్మల్ గా ఉన్న మనుషుకే లిమిట్ గా తీసుకోవాలంటే, షుగర్ పెషెంట్స్ ఎలా తినాలి, ఎంత తినాలి? అసలు తినాలా వద్దా? ఇదే కదా మీ డౌటు.మీ ఇంట్లో కూడా షుగర్ పెషెంట్స్ ఉంటుంటారు .వారికి చెప్పాలి కదా.
షుగర్ పేషెంట్లు మామిడిని తినొచ్చు.ఎందుకంటే మామిడిలో ఉండేది కేవలం షుగర్ ఒక్కటే కాదు కదా.విటమిన్స్, న్యూట్రింట్స్ దండిగా ఉంటాయి.మరి వారు మాత్రం ఆ బెనిఫిట్స్ ఎందుకు పొందకూడదు .మామిడి రుచి వారు మాత్రం ఎందుకు చూడకూడదు.తినవచ్చు .మామిడి ఒక్కటే కాదు, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే అరటిపండుని కూడా తినవచ్చు.కాని లిమిట్ లో.
ప్రతి వంద గ్రాముల మామిడిలో 14 గ్రాముల షుగర్ ఉంటుంది.ప్రతి వంద గ్రాముల అరటిలో 12 గ్రాముల షుగర్ ఉంటుంది.
అందుకే, షుగర్ పెషెంట్లు ఈ రెండు ఫలాల్లో ఏది తీసుకున్నా రోజుకి 50 గ్రాముల వరకే తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.ఇదే విషయాన్ని డైటీషన్ నిపుణులు కూడా ధృవీకరించారు.
అయితే ఇలాంటి షుగర్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకుంటునప్పుడు షుగర్ పెషెంట్లు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి.వ్యాయామం బాగా చేయాలి, మానసిక ఒత్తిడి అస్సలు ఉండకూడదు.
అప్పుడే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.