ఫీవర్ తో బాధపడుతున్న వారు అరటిపండు తింటున్నారా..? అయితే ఈ విషయాలు మీకోసమే..!

వాతావరణంలో మార్పుల కారణంగా ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలు తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు.కేవలం జ్వరం మాత్రమే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలతో( health problems ) బాధపడుతూ ఉన్నారు.

 Do Those Suffering From Fever Eat Banana But These Things Are For You , Eat Ban-TeluguStop.com

దీనికి కారణం జీవనశైలిలో మార్పులనే చెప్పవచ్చు.అయితే జ్వరం వచ్చినప్పుడు కొంతమంది ప్రజలు తమకు ఇష్టమైన ఆహారాన్ని తిన్నా కూడా రుచి అంతా తెలియకుండా ఉంటుంది.

అయితే కొంతమంది ఈ సమయంలో అరటిపండు తినవచ్చా లేదా అని సందేహ పడుతుంటారు.అయితే తాజాగా ఆరోగ్య నిపుణులు జ్వరం వచ్చినప్పుడు అరటిపండు( banana ) తినవచ్చా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యంగా చెప్పాలంటే జ్వరంతో బాధపడుతున్న వారు కచ్చితంగా అరటిపండును తినవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.అయితే జ్వరం వచ్చిన వారు ఎలాంటి అపోహ లేకుండా అరటి పండ్లను తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే అరటి పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం( Vitamin C, antioxidants, potassium ) ఎక్కువగా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే అరటిపండు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.

దీంతో జ్వరం నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది.

అలాగే జలుబు( cold ) సమస్యలతో బాధపడుతున్న వారు కూడా అరటిపండు తినవచ్చా లేదా అని అపోహ చాలా మందిలో ఉంటుంది.వారికి నిపుణులు ఏం చెబుతున్నారంటే అరటి పండులో అధికంగా శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది.కాబట్టి జలుబు ఉన్నప్పుడు అసలు అరటి పండ్లు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ తింటే మరిన్ని ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి జ్వరం వచ్చినప్పుడు మాత్రమే అరటి పండును తినవచ్చు.

అంతే కానీ జలుబు చేసినప్పుడు మాత్రం అరటి పండుకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube