పూజా హెగ్డే (Pooja Hedge)పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా శాసించారు.పూజా హెగ్డే సినిమాలో ఉందంటే చాలు ఆ సినిమా హిట్ అని ఈమె గోల్డెన్ లెగ్ అంటూ దర్శక నిర్మాతలు ఈమెపై ప్రశంసల కురిపించారు.
అయితే పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ కూడా ఒకానొక సమయంలో వరుసగా డిజాస్టర్ అవుతూ వచ్చాయి ఎలాంటి స్టార్ హీరో సినిమాలో నటించిన కూడా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు.
ఇలా సినిమా ఫ్లాప్ కావడంతో క్రమక్రమంగా పూజా హెగ్డేకి సినిమా అవకాశాలు కూడా తగ్గడం ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది.
ఇలా కొంతకాలం పాటు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూజ హెగ్డే తిరిగి మరి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు.
ఈమె ప్రస్తుతం అరడజను సినిమాలకు కమిట్ అవుతూ వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పూజ హెగ్డే చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య వ్యత్యాసం ఎప్పటి నుంచో ఉంది.హీరోలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
సినిమా కథ మొత్తం హీరోల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.ఇలా బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కూడా హీరోల పాత్రకు హీరోలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
ఇక సినిమా సక్సెస్ అయ్యింది అంటే ఒక హీరో వల్ల మాత్రమే సక్సెస్ కాదని అందరి కృషి వల్ల సినిమా సక్సెస్ అవుతుంది కానీ హీరో హీరోయిన్ల మధ్య వ్యత్యాసం మాత్రం చూపిస్తున్నారని తెలిపారు.

సినిమా షూటింగ్ జరుగుతుంటే హీరోల క్యారవాన్ ( Caravan )మాత్రం షూటింగ్ లోకేషన్ కు చాలా దగ్గరలో ఉంటాయి కానీ హీరోయిన్ క్యారవాన్ మాత్రం ఎక్కడో తీసుకెళ్లి పెడతారు.మేము మా పాత్రలో నటిస్తూ పెద్ద ఎత్తున హెవీ డ్రెస్సులు మేకప్ వేసుకొని అంత దూరం నడుచుకుంటూ వెళ్లాల్సిందే.మా పాత్ర కోసం మేము ఎంతో కష్టపడతాము కానీ పోస్టర్‌పై మా పేర్లు కూడా ఉండవ్.
సినిమా అనేది సమిష్టి కృషి.ఈ విషయం వారికెందుకు అర్థం కాదు? లవ్‌స్టోరీల్లో కూడా హీరోయిన్లకు గుర్తింపు ఇవ్వరు అంటూ పూజా హెగ్డే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.