రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్ (Betting App) ప్రమోషన్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.బాగా ఫేమస్ అయినటువంటి సెలబ్రిటీలు యూట్యూబర్స్ ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న నేపథ్యంలో వీటిని కట్టడి చేయడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు.
ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు యూట్యూబర్స్ పై కేసులు నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను విచారణకు కూడా పిలుస్తూ వచ్చారు.

ప్రతిరోజు కొంతమందిని ఈ విషయంలో విచారణ చేస్తూ వస్తున్నారు.ఇకపోతే తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో హీరోయిన్లు కూడా చిక్కుల్లో పడ్డారు.గతంలో రానా విజయ్ దేవరకొండ వంటి వారిపై కూడా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.అయితే తాజాగా బాలకృష్ణ (Balakrishna), ప్రభాస్ (Prabhas)గోపీచంద్ (Gopi Chand) పై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఫిర్యాదులు వచ్చాయి.
రామారావు అనే వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు ఈ హీరోలపై ఫిర్యాదు చేశారు.వీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అంటూ వీరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాలకృష్ణ హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా హాజరైన విషయం మనకు తెలిసిందే .ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ సంయుక్తంగా ‘Fun88’ అనే చైనీస్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు అంటూ.మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు.ఈ షో చూసి కొన్ని లక్షల మంది బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయారని ఈయన తెలిపారు.ఈ బెట్టింగ్ యాప్ లో భాగంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.