ఆ పాత్ర శారీరకంగా ఎన్నో సవాళ్లు విసిరింది.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరనే సంగతి తెలిసిందే.నిధి అగర్వాల్ తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.

 Heroine Nidhi Agarwal Shocking Comments Goes Viral In Social Media , Tollywood-TeluguStop.com

వరుస విజయాలతో జోరుమీదున్న నిధి అగర్వాల్ ( Nidhi Agarwal )త్వరలో హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ ఏడాది మే నెల 9వ తేదీన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో పాటు ది రాజాసాబ్ సినిమాతో నిధి అగర్వాల్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో హరిహర వీరమల్లు మూవీ( Harihara Veeramallu ) ప్రత్యేకమైనదని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

ఈ సినిమాలో నేను పోషించిన పంచమి పాత్ర ఎన్నో సవాళ్లు విసిరిందని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో బరువైన క్యాస్టూమ్స్, ఆభరణాలను ధరించానని నిధి అగర్వాల్ వెల్లడించారు.

Telugu Classical Dance, Nidhi Agarwal, Horseback, Tollywood-Movie

ప్రతిరోజూ కనీసం 35 కేజీల బరువును నేను మోయాల్సి వచ్చేదని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.భారీ దుస్తులు, నగలతో షూటింగ్ లో పాల్గొనడం నాకు ఎంతో కష్టంగా అనిపించేదని ఆమె చెప్పుకొచ్చారు.షాట్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఒక దగ్గర కూర్చోవడమే తప్ప విశ్రాంతి తీసుకోవడానికి వీలుండేది కాదని నిధి అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Telugu Classical Dance, Nidhi Agarwal, Horseback, Tollywood-Movie

ఈ సినిమా కొరకు గుర్రపు స్వారీ, క్లాసికల్‌ డ్యాన్స్‌ లో నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని నిధి అగర్వాల్ వెల్లడించారు.పవన్ కు జోడీగా నటించడం నా లక్ అని ఆమె అన్నారు.పవన్ లెజెండ్ అని పవన్ కళ్లు పవర్ ఫుల్ కళ్లు అని నిధి అగర్వాల్ తెలిపారు.

పవన్ నటన చూసి ఆశ్చర్యపోయేదానినని కష్టమైన సన్నివేశంలో సైతం పవన్ సులువుగా చేసేవారని ఆమె పేర్కొన్నారు.భవిష్యత్తులో నిధి అగర్వాల్ మరిన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో భాగమవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube