దొండ‌కాయ తింటే మ‌తిమ‌రుపు వ‌స్తుందా.. అస‌లు ఇందులో నిజ‌మెంత‌..?

దొండకాయ( Ivy Gourd ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.రోజువారీగా వండుకునే కూరగాయల్లో దొండకాయ ఒకటి.

 Is Ivy Gourd Good For The Brain Details, Ivy Gourd, Ivy Gourd Health Benefits,-TeluguStop.com

చాలామంది దొండకాయను ఎంతో ఇష్టంగా తింటుంటారు.అయితే కొందరు మాత్రం దొండకాయకు ఆమడ దూరంలో ఉంటారు.

దొండకాయ తింటే మతిమరుపు, మందబుద్ధి వస్తాయని నమ్మడ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.కొన్ని తరాల నుంచి దీన్ని బలంగా విశ్వ‌సిస్తున్నారు.

కానీ దొండకాయ తింటే మతిమరుపు( Memory Loss ) వస్తుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.పైగా కొన్ని అధ్యయనాల ప్రకారం దొండకాయ తినడం వల్ల బ్రెయిన్ షార్ప్ గా మారుతుందని, తెలివితేటలు పెరుగుతాయని తేలింది.

దొండకాయ వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు.చూడడానికి పొట్టిగా ఉన్నా కూడా దొండకాయలో పోషకాలు మాత్రం గట్టిగా ఉంటాయి.దొండకాయలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్ తదితర పోషకాలు లోడ్ చేయబడి ఉంటాయి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు దొండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

Telugu Alzheimers, Brain, Diabetes, Eye, Tips, Iron Deficiency, Ivy Gourd, Lates

ముఖ్యంగా రక్తహీనతతో బాధపడుతున్న వారికి దొండకాయ ఉపయోగకరంగా ఉంటుంది.దొండకాయ ఐరన్ లోపాన్ని( Iron Deficiency ) నివారిస్తుంది.రక్తహీనతను తరిమి కొడుతుంది.అలాగే దొండకాయలో ఉండే విటమిన్ బి నాడీ వ్యవస్థకు అండగా నిలుస్తుంది.మానసిక ఆందోళనను దూరం చేస్తుంది.అల్జీమర్స్( Alzheimers ) వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

మధుమేహం( Diabetes ) ఉన్నవారు దొండకాయను తమ డైట్ లో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Telugu Alzheimers, Brain, Diabetes, Eye, Tips, Iron Deficiency, Ivy Gourd, Lates

అంతేకాదు దొండకాయను తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ‌క్రియను చురుగ్గా మారుస్తుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది.దొండకాయలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరిచి దృష్టి లోపాలను సరిచేస్తుంది.

దొండ‌కాయ‌లో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.మ‌రియు కాల్షియం ఎముక‌ల‌ను బ‌లోపేతం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube