మధుమేహం.( Diabetes ) దీన్నే మన వాడుక భాషలో చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి అని పిలుస్తాము.
నేటి కాలంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల కోట్లాది మందిని మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు.మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి.
ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే.అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు ఏం తినాలన్నా భయపడుతుంటారు.
ముఖ్యంగా ఫ్రూట్స్( Fruits ) జోలికి అస్సలు పోరు.ఎందుకంటే ఫ్రూట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
సపోటా, మామిడి, చెర్రీస్, గ్రేప్స్, ఖర్జూరం అరటి వంటి పండ్లు ఆ కోవకే చెందుతాయి.మరి దానిమ్మ పండు( Pomegranate ) సంగతేంటి.? షుగర్ వ్యాధి ఉన్నవారు దానిమ్మ పండు తినొచ్చా.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.దానిమ్మ ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో ఒకటి.తినడానికి రుచికరంగానే కాకుండా దానిమ్మలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మొత్తంగా నిండి ఉంటాయి.

దానిమ్మ జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.అలాగే ఎముకలను( Bones ) బలోపేతం చేయడానికి, కణ విభజనకు, రక్తపోటును నియంత్రించడానికి తోడ్పడుతుంది.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.రక్తహీనతను తరిమికొడుతుంది.ఎర్ర రక్త కణాల నిర్మాణానికి మద్దతు ఇస్తుంది.గుండె ఆరోగ్యానికి( Heart Health ) సైతం అండంగా నిలబడుతుంది.
అందుకే దానిమ్మ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక మధుమేహం ఉన్నవారు దానిమ్మను తినొచ్చా అంటే తినొచ్చని అంటున్నారు.సాధారణంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి.ఎందుకంటే అవి రక్తంలో గ్లూకోజ్( Glucose ) నెమ్మదిగా పెరగడానికి కారణమవుతాయి.
అయితే దానిమ్మలు కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి.అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి.
కాబట్టి దానిమ్మ పండును షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోవచ్చు.కానీ మితంగా తీసుకోవడం చాలా అవసరం.
దానిమ్మ తో సహా ఏదైనా పండ్లను అధిక మొత్తంలో తినడం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దోహదపడుతుంది.







