ఈ ఓవర్ నైట్ ఫేస్ ప్యాక్ తో యవ్వనమైన మెరిసే తెల్లటి చర్మం మీ సొంతం అవుతుంది!

చర్మం యవ్వనంగా తెల్లగా మెరుస్తూ కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు.కానీ ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం తదితర అంశాలు చర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

 Get A Youthful Glowing White Skin With This Overnight Face Pack Details! Overnig-TeluguStop.com

దాంతో అటువంటి చర్మాన్ని పొందడం చాలా మందికి అసాధ్యంగా మారుతుంటుంది.కానీ సాధ్యమే.

ఇప్పుడు చెప్పబోయే ఓవర్ నైట్ ఫేస్ ప్యాక్ ను( Over Night Facepack ) ప్రయత్నిస్తే యవ్వనమైన మెరిసే తెల్లటి చర్మం మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలయం ఆ ఓవర్ నైట్ ఫేస్ ప్యాక్ ఏంటి.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( Rice Flour ) వేసుకోవాలి.

రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera ) హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి అప్లై చేసుకోవాలి.

Telugu Aloevera, Tips, Face Pack, Latest, Milk, Skin Care, Skin Care Tips, Vitam

నైట్ నిద్రించే ముందు ప్యాక్ వేసుకుని బాగా ఆరిన తర్వాత నిద్రించాలి.మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ ఓవర్ నైట్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

Telugu Aloevera, Tips, Face Pack, Latest, Milk, Skin Care, Skin Care Tips, Vitam

ముడతలు చారలు వంటి వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.స్కిన్ టైట్ గా మారుతుంది.యవ్వనంగా మెరుస్తుంది.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.సహజంగానే ముఖ చర్మం అందంగా, ఆకర్షణీయంగా మారుతుంది.

కాబట్టి యవ్వనమైన మెరిసే తెల్లటి చర్మాన్ని పొందాలని భావించేవారు తప్పకుండా ఈ సింపుల్ ఓవర్ నైట్ ఫేస్ ప్యాక్ ను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube