నిజం ఎంతోకాలం దాగదు.. ఈరోజు వస్తుందని తెలుసు.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో మంచు లక్ష్మి( Manchu Lakshmi ) ఒకరు.మంచు లక్ష్మి రియా చక్రవర్తికి ( rhea chakravarthy )క్లీన్ చిట్ ఇవ్వడం గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.2020 సంవత్సరంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput )మృతి చెందగా ఆ సమయంలో సుశాంత్ మృతికి రియా కారణమని ఆరోపణలు వినిపించాయి.ఆ సమయంలో రియా చక్రవర్తిపై ట్రోల్స్ కూడా వచ్చాయి.

 Manchu Laaxmi Sensational Comments About Rhea Chakravarthy Controversy Details I-TeluguStop.com

ఆ సమయంలో రియా చక్రవర్తిని విలన్ గా చూశారనే సంగతి తెలిసిందే.ఈ వివాదం వల్ల రియా చక్రవర్తికి మూవీ ఆఫర్లు సైతం రాలేదు.మంచు లక్ష్మి తన పోస్ట్ లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు ముందే తెలుసని ఎందుకంటే నిజం ఎంతోకాలం దాగదని పేర్కొన్నారు.కొంచెం ఆలస్యమైనా సరే బయటకు రాక తప్పదని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

రియా, ఆమె ఫ్యామిలీ ( Family )భరించలేని బాధను అనుభవించిందని ఆమె తెలిపారు.

Telugu Manchulaaxmi, Manchu Lakshmi, Sensational-Movie

సమాజం మిమ్మల్ని తప్పని నిందిస్తున్నా మీతో రాక్షసంగా ప్రవర్తిస్తున్నా మీరు పోరాడిన విధానం ఆదర్శవంతం అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.నిజానిజాలు తెలుసుకోకుండా మీపై నోరు పారేసుకున్న వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలని క్షమాపణలు చెప్పాలని మంచు లక్ష్మి అన్నారు.అన్యాయంగా ఒక ఫ్యామిలీని ఎంత బాధ పెట్టారో గుర్తు చేసుకుని పశ్చాత్తాపపడాలని ఆమె తెలిపారు.

Telugu Manchulaaxmi, Manchu Lakshmi, Sensational-Movie

రియా చక్రవర్తిని చూస్తే నాకు గర్వంగా ఉందని ఆమెకు మరింత శక్తి చేకూరాలని మంచు లక్ష్మి వెల్లడించారు.ఇది ఒక ఆరంభం మాత్రమేనని ఇకపై అంతా మంచే జరుగుతుందని మంచు లక్ష్మి అన్నారు.నువ్వు అనుభవిస్తున్న బాధ ఇప్పటికైనా తగ్గుతుందని ఆశిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.నటి మంచు లక్ష్మి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube