దారుణం.. లైవ్ లో ఉరివేసుకున్న వ్యక్తి.. విడ్డూరంగా చూస్తూ ఉండిపోయిన భార్య, అత్త

మధ్యప్రదేశ్‌లోని( Madhya Pradesh ) రేవా జిల్లాలో జరిగిన ఓ ఘటన మానవత్వం లేని వైఖరిని బహిర్గతం చేసింది.ఈ దారుణ సంఘటనలో ఓ పూజారి,( Priest ) తన భార్య మరియు అత్త వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 Madhya Pradesh Man Hangs Self Wife Mother-in-law Watch Live On Instagram Details-TeluguStop.com

అతడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో( Instagram Live ) ఉరివేసుకుంటుంటే, భార్య మరియు ఆమె తల్లి చూస్తూ ఉన్నప్పటికీ, ఆపే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది.ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఈ దీనగాథలో బాధితుడు శివ ప్రకాష్ త్రిపాఠి,( Shiva Prakash Tripathi ) మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా అమా నౌధియా గ్రామానికి చెందిన 26 ఏళ్ల పూజారి.ఛత్తీస్‌గఢ్‌లోని వార్దాలో ఓ ఆలయంలో పూజారిగా సేవలు అందించిన ఈయన, రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయమవడంతో ఊతకర్ర సాయంతోనే నడిచే స్థితికి చేరుకున్నాడు.

ఈ పరిస్థితిలో ఆలయ సేవలు కొనసాగించలేక, తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

శివ ప్రకాష్ త్రిపాఠికి రెండేళ్ల క్రితం ప్రియా శర్మతో వివాహం జరిగింది.

అయితే, రోడ్డు ప్రమాదం తర్వాత అతడి శారీరక పరిస్థితి బలహీనపడటంతో వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయి.ఈ క్రమంలో భార్య ప్రియా శర్మ మరో వ్యక్తితో చనువుగా ఉండటం మొదలైంది.

ఇది గమనించిన త్రిపాఠి, ఆమెను ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.కానీ, ప్రియ తన ప్రవర్తనను మార్చుకోకపోగా, చివరకు భర్తను వదిలేసి, పసిబిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.

Telugu Domestic, Extra, India, Live, Madhya Pradesh, Priest, Rewa, Shivaprakash,

తన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావాలని త్రిపాఠి అత్తింటికి ఎన్నోసార్లు వెళ్లి ప్రయత్నించాడు.అయితే, ప్రియా శర్మ ఒప్పుకోలేదు, అత్త కూడా అడ్డుపడింది.ఇటీవల మరోసారి అత్తింటికి వెళ్లిన త్రిపాఠి, భార్యను, అత్తను ప్రాధేయపడ్డాడు.కానీ, వారు అతడిని తీవ్రంగా అవమానించడమే కాక, చేయి కూడా చేసుకున్నారు.మానసికంగా పూర్తిగా కుంగిపోయిన త్రిపాషి ఇంటికి తిరిగి వచ్చాడు.

Telugu Domestic, Extra, India, Live, Madhya Pradesh, Priest, Rewa, Shivaprakash,

ఇంటికి చేరిన త్రిపాఠి, తన గదిలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నాడు.ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ దారుణ దృశ్యాన్ని అతడి భార్య ప్రియా శర్మ, ఆమె తల్లి కలిసి చూశారు.

అయినప్పటికీ, వారు అతడిని ఆపేందుకు లేదా వారించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.చివరకు కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, త్రిపాఠి ఆత్మహత్యపై కేసు నమోదు చేశారు.దర్యాప్తులో భాగంగా, భార్య ప్రియా శర్మకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది.

ఈ విషయంలో ఆమె తల్లి కూడా సహకరించినట్లు ఆధారాలు లభించాయి.దీంతో ప్రియా శర్మ, ఆమె తల్లిని పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తరలించారు.

ప్రస్తుతం ఈ కేసుపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

ఈ ఘటన సమాజంలో కనీస మానవత్వం కూడా కొందరిలో లోపించిందనే వాస్తవాన్ని తెలియజేస్తోంది.

ఎన్నో నెలలు కలిసి జీవించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటుంటే, దానిని చూస్తూ ఊరుకోవడం ఎంతటి నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు.ఈ సంఘటనపై సమాజంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube