సమస్త లోకాలకు వెలుగును అందించే సూర్యుడుధనుర్మాసం నుంచి మకరరాశిలోకి పయనించే రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.ఈ సంక్రాంతి పండుగ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరుపుకుంటారు.
భోగి, మకర సంక్రాంతి, కనుమ అని మూడు రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటారు.ఈ మకర సంక్రాంతి రోజు రైతులు పండించిన పంటలన్నీ ఇంటికి చేరుకోవడంతో రైతులు ఈ పండుగ ఎంతో ఆనందంగా కోలాహలంగా జరుపుకుంటారు.
ఈ సంక్రాంతి పండుగను దేశం మొత్తం ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుచుకుంటూ జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం ధనుర్మాసం నుంచి మకర సంక్రాంతి లోకి సూర్యుడు ప్రవేశించటం వల్ల ఆ రోజున మకర సంక్రాంతి జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి జనవరి13వ తేదీన జరుపుకునే వారు.కానీ 2021 ఈ సంవత్సరం జనవరి14 వ తేదీన దేశవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటారు.
జనవరి 14 ఉదయం 8:30 నుంచి సాయంత్రం5:54 వరకు మకర సంక్రాంతి పుణ్యకాలం ఉంటుంది.అదేవిధంగా 8:30 నుంచి 10:22 గంటల వరకు మకర సంక్రాంతి మహా పుణ్య కాలం ఉంటుంది.ఈ మహా పుణ్య కాలంలో ఎటువంటి పూజలు చేసిన మంచి ఫలితాన్ని పొందవచ్చు.
అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరంలో పంటలు బాగా పండి రైతులు అధిక దిగుబడిని పొందుతారని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది వస్తువుల ధరలు అమాంతం పెరుగుతాయని, ప్రజలందరూ భయాందోళన చెందుతారని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు.ప్రతిరోజు ఉదయం స్నానమాచరించి ఆ సూర్య భగవానుని నమస్కరించడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు.
ఈ మకర సంక్రాంతి రోజు వివిధ రకాల రంగు ముగ్గులు, హరిదాసు గీతాలు, కోడి పందేలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.ఈ విధంగా మూడు రోజులపాటు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.