ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.49
సూర్యాస్తమయం: సాయంత్రం.5.47
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఆశ్లేష మంచిది కాదు
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
మేషం:

ఈరోజు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.గృహమున కొన్ని వాదనలు మొదలవుతాయి.
వృషభం:

ఈరోజు ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి.కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి.ధన పరమైన సమస్యలు బాధిస్తాయి.
దైవ చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
మిథునం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఆలయాలు సందర్శిస్తారు.నూతన వాహనయోగం ఉన్నది.
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:

ఈరోజు దైవదర్శనాలు చేసుకుంటారు.వృధా ఖర్చులు అదుపు చెయ్యడం మంచిది.వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.
సింహం:

ఈరోజు ఉద్యోగాలలో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు.ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి.అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
కన్య:

ఈరోజు కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
తుల:

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
వృశ్చికం:

ఈరోజు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.
ధనుస్సు:

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి.ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.వృత్తి, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
మకరం:

ఈరోజు విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి.వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి.
ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.
కుంభం:

ఈరోజు ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.ఆకస్మిక ధన లాభాలు పొందుతారు.
వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.విలువైన వస్తులాభాలు పొందుతారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహనిస్తుంది.
మీనం:

ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి.ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు.
నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.ఆదాయ మార్గాలు మందగిస్తాయి.
వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
DEVOTIONAL