నోటి పూత సమస్య చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్య.నోటి పూత రావటానికి అనేక కారణాలు ఉన్నాయి.
అయితే ఏ కారణం వల్ల నోటి పూత వచ్చినా నోట్లో పెదాల లోపలి వైపు, నాలుక మీద, బుగ్గల లోపలి వైపు పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి.దీంతో ఏ ఆహారం తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ముఖ్యంగా కారంగా ఉన్న పదార్థాలు తింటే ఆ పుండ్లు విపరీతమైన మంటను కలిగిస్తాయి.అయితే ఇప్పుడు చెపుతున్న చిట్కాలను పాటిస్తే నోటి పూత సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.!
తేనేనోటిలో పుండ్లు ఉన్న ప్రదేశంలో తేనెను రాసి అరగంట వరకు అలానే ఉండాలి.
ఈ సమయంలో ఎటువంటి ఆహారాలు,ద్రవాలు తీసుకోరాదు.ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తే నోటి పూత సమస్య నుండి బయట పడవచ్చు.
తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్ గుణాలు నోటి పూతను తగ్గించటంలో సహాయపడతాయి.
కొబ్బరి నూనెకొబ్బరి నూనెలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన నోటి పూతను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
కొంచెం కొబ్బరి నూనెను తీసుకోని పుండ్లపై రాయాలి.ఇలా రోజు చేస్తూ ఉంటే త్వరగా నోటి పూత తగ్గిపోతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్అర కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగా పుక్కిలించాలి.ఆ తర్వాత ఆ నీటిని ఉమ్మేయాలి.ఈ విధంగా రోజులో కనీసం 3 సార్లు చేస్తే నోటి పూత సమస్య నుంచి బయట పడవచ్చు.
ఉప్పు నీరుఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పును వేసి బాగా కలపాలి.ఆ మిశ్రమంతో నోటిని పుక్కిలించాలి.
ఈ విధంగా రోజూ చేస్తే సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
ఆరెంజ్ జ్యుస్ప్రతి రోజు రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యుస్ త్రాగాలి.
ఈ విధంగా నోటి పూత తగ్గేవరకు త్రాగాలి.ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి నోటి పూతను తగ్గించటంలో సహాయపడుతుంది.
వెల్లుల్లిసహజ సిద్ధమైన యాంటీ బయోటిక్ లక్షణాలు వెల్లుల్లిలో ఉన్నందున నోటిపూతను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని బాగా నలిపి వాటిని పుండ్లపై రాయాలి.ఈ విధంగా రోజులో కనీసం 3, 4 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.