పూరీ జగన్నాథ్ దగ్గర ఏకంగా అన్ని కథలున్నాయట.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన దర్శకులలో పూరీ జగన్నాథ్( Director Puri Jagannadh ) ఒకరు.దాదాపుగా తను డైరెక్టర్ గా పని చేసిన ప్రతి హీరోకు హిట్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 Director Puri Jagannadh Having 4 Stories Details, Director Puri Jagannadh , Puri-TeluguStop.com

పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ప్రస్తుతం 4 కథలు సిద్ధంగా ఉన్నాయట.

లైగర్,( Liger ) డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచిన నేపథ్యంలో పూరీ జగన్నాథ్ అంటే టాలీవుడ్ నిర్మాతలు భయపడే పరిస్థితి ఏర్పడింది.ఒకప్పుడు పూరీ జగన్నాథ్ తో సినిమాలు చేయడానికి క్యూ కట్టిన నిర్మాతలు సైతం ప్రస్తుతం ముఖం చాటేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు.

గోపీచంద్( Gopichand ) పూరీ జగన్నాథ్ కాంబినేషన్ గురించి వార్తలు వినిపించిన ఆ వార్తలు నిజం కాలేదు.

Telugu Puri Jagannadh, Double Ismart, Gopichand, Liger, Purijagannadh-Movie

సీనియర్ హీరోలతో సినిమా చేయాలని పూరీ జగన్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఎంతమేర వర్కౌట్ అవుతాయనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకాల్సి ఉంది.పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మించినా ఆ సినిమాలకు బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Puri Jagannadh, Double Ismart, Gopichand, Liger, Purijagannadh-Movie

పూరీ జగన్నాథ్ కు 2025 సంవత్సరం కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.పూరీ జగన్నాథ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.బయటి రచయితల కథలతో పూరీ జగన్నాథ్ సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూరీ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube