రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఉన్నామనేది కాదు.ఉన్నంత కాలం ఎంత మందికి న్యాయం చేశామనేది ముఖ్యం.
తానూ ఓట్లేసి గెలిపించిన ప్రజలకే కాదు.ఏపీలో ఉన్న ప్రజలు అందరూ తన వాళ్ళు అనుకునే గొప్ప మనసు ఎంత మంది నాయకులకి ఉంటుంది.
తాను పుట్టి పెరిగిన ఈ ఏపీ గడ్డ ఋణం తీర్చుకోవాలనే ఆలోచన ఎంత మందిలో కలుగుతుంది అంటే…ఏమో కానీ ఈ యంగ్ ఎంపీ ఆలోచనలు మాత్రం అలానే కనిపిస్తున్నాయి.ఎంతన్నా తండ్రి వారసత్వం ఎక్కడికి పోతుంది.
రామ్మోహన్ నాయుడి రూపంలో పార్లమెంట్లు లూ ఎప్పటికప్పుడు గర్జిస్తూనే ఉంది అంటూ రాజకీయ నాయకులే కాదు సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు
అసలు ఇప్పుడు ఈ ఎంపీ గురించి ఎందుకు చర్చకు వచ్చింది అనుకుంటే.ఒక పక్క పోలవరం విషయం లో మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి ఎంతో కూల్ గా ఉండే చంద్రబాబు సైతం మీకో దణ్ణం అంటూ బిజేపి విషయంలో తన అసహనాన్ని ప్రదర్శించడం అందరికీ తెలిసిన విషయమే.
ఎన్నో వ్యయప్రయాసలు పడి చంద్రబాబు పోలవరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించు కుంటూ ఉంటే ప్రాజెక్ట్ పనులు ఆపాలి అంటూ రాజకీయ లబ్ది కొరకు బిజెపి బాబుకి అడ్డుపడిన వ్యవ్యహారం ఇప్పుడు ఏపీ ప్రజలలో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించాయి.ఇదిలా ఉంటే మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలని ఒక్కొక్కటిగా పక్కకు నేట్టేస్తున్నారు.
వాటిలో అతి ముఖ్యమైనది “విశాఖ రైల్వేజోన్” ఇప్పుడు ఈ అంశమే “మోడీ జీ” కి చెమటలు పట్టిస్తోంది
ఎందుకంటే ఇప్పటికే పోలవరం విషయం లో మోడీ వేసిన రాంగ్ స్టెప్ ఏపీ ప్రజల్లో బిజెపి పై ఎంత వ్యతిరేకతని మూటకట్టుకొందో మోడీ టేబుల్ పై ఉన్న రిపోర్ట్స్ చెప్పకనే చెప్తున్నాయి.ఇదే సమయంలో శ్రీకాకుళం ఎంపీ.
కింజరాపు.రామ్మోహన్ నాయుడు “విశాఖ రైల్వేజోన్” ఏమైందన్న అంశంపై ప్రైవేటు మెంబర్ బిల్లు ఇచ్చాడు.
దీనిని లోక్‌సభ సచివాలయం కూడా ఆమోదించడంతో ఈ బిల్లు చర్చకు రానుంది…ఇప్పటికే పార్లమెంట్లులో పలు సందర్భాలలో అనేక అంశాల మీద ఈ యంగ్ ఎంపీ ఏపీ కోసం మాట్లాడిన తీరు ఎంత సూటిగా ఉంటుందో “మోడీజీ” కి బాగా తెలుసు.అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో భారత దేశ యువత తరుపున అనర్గళంగా మాట్లాడిన రామోహన్ నాయుడు తమ ఏపీ ప్రజల మనోభావాల కోసం ఏ రేంజ్ లో మాట్లాడతాడో ఊహించుకుంటేనే బిజేపి కి టెన్షన్ మొదలవుతోందో
అంతేకాదు “విశాఖ రైల్వేజోన్” తో పాటు ఏపీకి ఓటు భర్తీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పోలవరం ఇలా ఒక్కో అంశం లేవనెత్తితే.
మిగిలిన పార్టీ వారు కూడా తప్పకుండా ఏపీ ప్రజల తరుపున ఈ విషయాలలో సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.ఒక వేళ అదే జరిగితే మోడీ ఏపీ ప్రజల దృష్టిలో బిజెపి అన్యాయం చేస్తోంది అనే భావన పార్లమెంట్లు సాక్షిగా బయట పెట్టడంలో రామోహన్ నాయుడు సక్సెస్ అయ్యినట్టే.
ఏపీలో బిజెపిని ఇరకాటంలో పడేసినట్టే.ఇప్పుడు ఇదే మోడీలో గుబులుకి కారణం అయ్యింది.
మరి ఈ యంగ్ ఎంపీ సంధించేబోయే ప్రశ్నలకి మోడీ ఎటువంటి సమాధానలు ఇస్తారో అప్పటి వరకూ వేచి చూడాల్సిందే.రామోహన్ నాయుడు తీసుకున్న ఈ డేర్ స్టెప్ చుసిన వాళ్ళు అందరు రామోహన్ నాయుడుని ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీ మాత్రమే కాదు ఏపీ ఎంపీ అంటున్నారు.







