రచనా బెనర్జీ ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్.బెంగాలీ అమ్మాయి అయిన రచనా బెనర్జీ తెలుగు సినీ పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన బావగారు బాగున్నారా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.దీంతో అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి.చిరంజీవితో పాటు మోహన్‌బాబు, వెంకటేష్, రవితేజ, శ్రీకాంత్ లాంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది.పాపులర్ హీరోయిన్ గా కొనసాగిన ఆమె అనుకోకుండా తెలుగు సినిమా పరిశ్రమకు దూరం అయ్యింది.
ఈమె తెలుగు సినిమాకు దూరం కావడానికి కారణం తనకున్న చెడు అలవాట్లేనని పలువురు అంటుంటారు.హీరోయిన్ గా మంచి కెరీర కొనసాగుతున్న సమయంలోనే మద్యానికి బానిస అయ్యింది.
స్మోకింగ్ కు ఎడిక్ట్ అయ్యింది.తాగడు కారణంగానే ఈమె సినీ కెరీర్ పూర్తిగా దెబ్బతిన్నది.
తర్వాత సినిమా అవకాశాలు రావడం మానేశాయి.

చివరకు చిన్న చిన్న సినిమాల్లో నటించింది. సాయికుమార్ లాంటి హీరోల పక్కన కూడా యాక్ట్ చేసింది.తనను బాగు చేయాలనే ఉద్దేశంతో రచన కుటుంబ సభ్యులు ఆమెను సినిమా పరిశ్రమకు చెందిన ప్రోబల్ బసు అనే వ్యక్తితో వివాహం జరిపించారు.
ఆ తర్వాత ఆమె కెరీర్ కాస్త ట్రాక్‌లోకి వచ్చింది.నెమ్మదిగా తన చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పిందట.

వివాహం తర్వాత తను ఓ బాబుకు జన్మనిచ్చింది.ఆ తర్వాత మళ్లీ సినిమా రంగంలోకి ప్రవేశించి పలు సినిమాలు చేసింది.ప్రస్తుతం కెరీర్ మీద ఫోకస్ చేసింది.నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది.అటు తెలుగులో మంచి అవకాశాలు వస్తే చేస్తానని చెప్తోంది.తన కొడుకుని బెంగాళీ పరిశ్రమలో హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది.
రచన హీరోయిన్ గా సౌత్ తో పాటు నార్త్ ఇండియాలోని పలు సినిమా పరిశ్రమల్లో సినిమాలు చేసింది.తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ, ఒడియా భాషల్లో మొత్తం 200కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసి మంచి నటిగా గుర్తింపు పొందింది.