60 లోనూ కురులు నల్లగా మెరవాలంటే ఈ చిట్కాలను తప్పక ఫాలో అవ్వండి!

నల్లటి మెరిసేటి కురులు( Black glitters ) మనల్ని మరింత అట్రాక్టివ్ గా చూపుతాయి.అందుకే అటువంటి జుట్టు కోసం ఆరాటపడుతూ ఉంటారు.

 Follow These Tips For Black Hair Even At 60s! Black Hair, Shiny Hair, Hair Care,-TeluguStop.com

అయితే ఇటీవల రోజుల్లో ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలతో నిండిన కేశ సంబంధిత ఉత్పత్తులు వాడటం తదితర కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.అయితే జుట్టు తెల్లబడిన తర్వాత బాధపడటం కంటే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడటం ఎంతో మేలు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఫాలో అయ్యారంటే 60 లోనూ కురులు నల్లగా మెరిసిపోతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

జుట్టులో మెలనిన్( Melanin ) ఉత్పత్తి తగ్గడం వల్ల కురులు తెల్లగా మారుతుంటాయి.అయితే మెలనిన్ ఉత్పత్తిని పెంచడంలో కరివేపాకు తోడ్పడుతుంది.నాలుగు టేబుల్ స్పూన్ల కరివేపాకు పొడిలో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( coconut oil ) మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

నెలకు కనీసం రెండుసార్లు ఈ మాస్క్ వేసుకుంటే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

Telugu Care, Care Tips, Oil, Healthy, Shiny-Telugu Health

ఆవ నూనె-ఆముదం ఈ రెండింటి కాంబినేషన్ కురుల విషయంలో మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుంది.రెండు టేబుల్ స్పూన్ల ఆవ నూనెకు( mustard oil ) రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలిపి జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.చుండ్రు సమస్య దూరమవుతుంది.

Telugu Care, Care Tips, Oil, Healthy, Shiny-Telugu Health

ఇక 60 లోనూ తమ జుట్టు నల్లగా మెరిసిపోవాలని భావించే వారు ఒకటిన్నర గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్( spoon tea powder ), రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి ( Amla powder )వేసి పది నిమిషాల పాటు మరిగించండి.ఆపై స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత స్ప్రే బాటిల్ లో నింపుకోండి.ఈ టోనర్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి స్ప్రే చేసుకుని గంట అనంతరం తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే వైట్ హెయిర్ సమస్య దరిచేరకుండా ఉంటుంది.

జుట్టు ఎల్లప్పుడూ నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube