టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Hero Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు.అందులో భాగంగానే ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం దేవర.
కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ ధరించే దుస్తుల గురించి వాచ్ ల గురించి అలాగే కార్ల గురించి మనందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ వాడే ప్రతి ఒక్క వస్తువు చూడడానికి చాలా సింపుల్ గా అనిపించినప్పటికీ వాటి ద్వారా లక్షల్లో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.
అంత కాస్ట్లీవి దరించినా కూడా ఎన్టీఆర్ మాత్రం చాలా సింపుల్ గానే కనిపిస్తూ ఉంటారు.ఎన్టీఆర్ వేసుకునే దుస్తులు, పెట్టుకునే యాక్ససిరీస్ మాత్రం కళ్లకు కనిపించేంత సింపుల్ కాదు.సెలబ్రిటీలంతా లక్షలు ఖరీదు చేసే దుస్తులు, యాక్ససిరీస్( Clothing, accessories ) వాడతారు.
ఈ రోజు తారక్ వేసుకున్న దుస్తులు కూడా అలాంటివే.ముంబయిలో దేవర ట్రయిలర్ లాంచ్ కు హాజరయ్యాడు ఎన్టీఆర్.
కాస్త డిఫరెంట్ గా ఉండే బ్లేజర్ లాంటిది వేసుకొచ్చాడు.చేతుల దగ్గర డిజైన్ కాస్త కొత్తగా ఉంది.
సెన్స్ అనే బ్రాండ్ అది.దాని ఖరీదు అక్షరాలా 46 వేల రూపాయలు.ఆ బ్లేజర్ లోపల నలుపు రంగులో సింపుల్ రౌండ్ నెక్ టీషర్ట్ ధరించాడు.
అమిరి అనే కంపెనీ షర్ట్ అది.దాని రేటు అటు ఇటుగా 50వేల రూపాయలుగా ఉంది.ఇక ముంబయి ప్రమోషన్స్ లో తారక్ రెగ్యులర్ గా ఒకే రకమైన షూ వేసుకొని కనిపించాడు.బ్యాలెన్సిగా అనే కంపెనీకి చెందిన షూ అది.దాని ధర దాదాపు లక్ష రూపాయలుగా ఉంది.ఏడాదిగా ఇదే బ్రాండ్ షూ వాడుతున్నారు ఎన్టీఆర్.ఇక ఈ హీరో రెగ్యులర్ గా ధరించే చేతి వాచీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది.ఎన్టీఆర్ దగ్గర ఓడమార్ పీగే బ్రాండ్ వాచీ ఉంది.దీని రేటు కోటి రూపాయల పైమాటే.
ఇకపోతే ఎన్టీఆర్ ధరించిన ఈ వస్తువుల ధరలు తెలిసి అభిమానులు వామ్మో అంత ఖరీదా అని షాక్ అవుతున్నారు.