వైరల్ పోస్ట్: ఏంటి గురూ.. కారును నేరుగా షెడ్ నుండి తెచ్చావా ఏంటి?

ప్రస్తుత రోజులలో మహానగరాలలో ఉండే ప్రజలు చాలావరకు కూడా నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా కానీ క్యాబ్ ను బుక్ చేసుకుని వారు వెళ్లవలసిన గమ్యానికి త్వరగా చేరుకుంటున్నారు.ఈ క్రమంలో ఉబర్, ఓలా, రాపిడో ( Uber, Ola, Rapido )లాంటి మరెన్నో సంస్థలు ఆన్లైన్ ద్వారా క్యాబ్ సర్వీస్ ( Cab service )లను ప్రజలకు అందజేస్తున్నాయి.

 What Viral Post Did The Guru Bring The Car Directly From The Shed, Uber ,no Stan-TeluguStop.com

ఈ క్రమంలో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నవారు ఎదుర్కొన్న సమస్యలను ఎప్పటికప్పుడు ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉంటారు.అచ్చం అలాగే తాజాగా ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

రోహిత్ అరోరా అనే వినియోగదారుడు ఉబర్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాడు.అయితే, రైడ్ కోసం వచ్చిన కారును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు.దీంతో వెంటనే సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసాడు.

అయితే దానికి ఉబర్ సంస్థ కూడా వెంటనే స్పందించింది.రోహిత్ అరోరా ( Rohit Arora )తాను ఎదురుకొన్న అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉబర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ.

ఉబర్‌ భారతదేశంలో ఎటువంటి ప్రమాణాలనూ పాటించడం లేదు.కారు జంక్ యార్డ్ నుండి వచ్చినట్లు కనిపిస్తోంది అంటూ కామెంట్ చేసి రెండు ఫొటోలను జత చేసి రాసుకొచ్చాడు.

అంతేకాకుండా, మరొక పోస్టులో నేను అద్భుతమైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన మెర్సిడెస్‌ బెంజ్‌ని అడగలేదు.కనీసం పరిశుభ్రత కోరుకోవచ్చు కదా.దీనికి డబ్బు అవసరం లేదు, చిన్న ప్రయత్నం చాలు రాయడంతో ఒక్కసారిగా ఉబర్ ఇండియా ఫిర్యాదుకు స్పందించింది.

ఉబర్ అందుకు అతడికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పి సదరు రైడ్ వివరాలను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని తెలియజేశారు.ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ ఫిర్యాదు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.వినియోగదారుల పట్ల భారత్ లో ఇలానే ప్రవర్తిస్తారని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే.

మరికొందరు మనదేశంలో రేటింగ్స్ కు ఎటువంటి వాల్యూ లేదు అంటూ కామెంట్ చేయగా.మరికొందరైతే, అచ్చం అలాగే నేను కూడా ఇలాంటి బాధను ఫేస్ అయ్యానని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube