ప్రస్తుత చలికాలంలో( Winter ) అత్యంత సర్వ సాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో జలుబు అనేది ముందు వరుసలో ఉంటుంది.ఇంట్లో ఒకరికి జలుబు చేసిందంటే ఆటోమేటిక్ గా మిగతా వారికి కూడా అంటుకుంటుంది.
పైగా ఈ కాలంలో జలుబు ఓ పట్టాన పోదు.ఇది చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.
ఒక్కోసారి జలుబు( Cold ) కారణంగా జ్వరం కూడా వస్తుంటుంది.అయితే జలుబును తరిమికొట్టే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి.
జలుబు రెండే రెండు రోజుల్లో పరార్ అవ్వాలంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను తప్పకుండా ప్రయత్నించండి.
అందుకోసం ముందుగా రెండు తమలపాకులు( Betel Leaf ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న తమలపాకులు, పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) పావు టీ స్పూన్ మిరియాలు పొడి( Black Pepper ) వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించండి.
ఆ తరువాత వన్ టీ స్పూన్ నల్ల బెల్లం పొడి( Black Jaggery Powder ) వేసి మరొక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని సేవించడమే.ఈ తమలపాకుల టీ ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా జలుబు చేసినప్పుడు రోజుకు ఒకసారి ఈ టీ ను కనుక తీసుకుంటే కేవలం రెండు రోజుల్లోనే జలుబు దూరమవుతుంది.
దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు, కఫం వంటి సమస్యలు ఉన్నా కూడా దూరం అవుతాయి.
అలాగే ఈ తమలపాకుల టీ శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది.తమలపాకు లో ఉండే యాంటీ-వైరల్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.అంతేకాకుండా ఈ తమలపాకుల టీ జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.