ఎర్రగా నిగ నిగలాడుతూ చూడగానే తినాలనిపించే యాపిల్స్‌ను దాదాపు అందరూ ఇష్టపడతారు.ఆరోగ్య పరంగా యాపిల్ ఎంతో మేలు చేస్తుంది.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఏ వయసు గల వారు అయినా తినగలిగే పండ్లలో యాపిల్ ఒకటి.అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కార్బోహైడ్రేట్లు ఇలా పోషకాలు యాపిల్ పండులో దాగి ఉన్నాయి.
అటు వంటి యాపిల్స్ నుంచి రోజుకు ఒకటి నుంచి రెండు తీసుకుంటే.ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అలా కాకుండా, అంతకు మించి యాపిల్ పండ్లను తీసుకుంటే మాత్రం అనేక సమస్యలను ఎదర్కోవాల్సి వస్తుంది.
పైన చెప్పుకున్నట్టు యాపిల్ పండ్లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి, రెండుకు మించి యాపిల్స్‌ను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోయి.మధుమేహం బారిన పడాల్సి వస్తుంది.
అలాగే మధుమేహం వ్యాధి ఉన్న వారు కూడా అతిగా యాపిల్ పండ్లను తినరాదు.అలాగే యాపిల్ పండ్లలో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.
ఈ ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేయడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
కానీ, ఎప్పుడైతే యాపిల్ పండ్లను ఓవర్ తీసుకుంటారో.అప్పుడు అదే ఫైబర్ జీర్ణ వ్యవస్థను దెబ్బ తీయడంతో పాటు గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చేలా ప్రేరిపిస్తుంది.అదేవిధంగా, యాపిల్స్ కార్ప్‌లతో నిండి ఉంటాయి.
అందువల్ల, యాపిల్ తీసుకున్న వెంటనే తక్షణ శక్తి లభిస్తుంది.అయితే అతిగా యాపిల్స్‌ను తింటే మాత్రం బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి, ఎప్పుడు కూడా యాపిల్ పండ్లను అతిగా తినరాదు.ఇలా చేస్తే.లేని పోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే.
యాపిల్ పండ్లను తినే ముందు వాటిని ఉప్పు నీటిలో ఐదు నిమిషాలు వేసి.ఆ తర్వాత బాగా కడిగి తినాలి.
లేదంటే, ఆ పండ్లపై పేరుకుపోయి ఉన్న పలు రసాయనాలు, దుమ్ము, ధూళీ కడుపులోకి వెళ్లి పలు సమస్యలను క్రియేట్ చేస్తుంది.