తెలుగు ప్రేక్షకులకు హీరో,విలన్,నటుడు విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎలాంటి పాత్ర అయినా సరే తన విలక్షణమైన నటనతో నటించి ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకున్నారు విజయ్ సేతుపతి.
ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే విజయ్ సేతుపతి ఇటీవల నటించిన చిత్రం మహారాజ.
( Maharaja Movie ) ఇందులో తండ్రి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు గాని ఉత్తమ నటుడుగా బిహైండ్‌వుడ్స్( Behindwoods Award ) అనే అవార్డును సైతం అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ సేతుపతి తన కెరీర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.మహారాజ కంటే ముందు తన కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఈ సినిమా విజయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను.ఈ విజయానికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది.మహారాజ సినిమా విడుదలైన తర్వాత నా కెరీర్ ఎంతో మారింది.
విజయ్ సేతుపతి అనగానే.మహారాజ మూవీలో యాక్ట్ చేశాడు కదా అని చెబుతున్నారు.
ఇది నన్నెంతో భావోద్వేగానికి గురిచేస్తోంది.దీనికంటే ముందు సుమారు మూడేళ్ల పాటు నా సినిమాలు సరిగ్గా ఆడలేదు.

నా కెరీర్ ముగిసిపోయిందని ఎంతోమంది వ్యాఖ్యలు చేశారు.కానీ ఈ సినిమా నన్ను నేను నిరూపించుకునేలా చేసింది.ఒక సినిమా ఈ విధంగా ప్రపంచానికి కనెక్ట్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని విజయ్ సేతుపతి అన్నారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ సేతుపతి ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు.
ఇకపోతే మహారాజ సినిమా విషయానికి వస్తే.నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజ చిత్రం గత ఏడాది జూన్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.
విభిన్నమైన కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా ఇది రూపొందిన విషయం తెలిసిందే.ఇందులో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించారు.ఒక సాధారణ సినిమాగా విడుదలైన ఈ చిత్రం అంతటా విశేష ఆదరణ సొంతం చేసుకుంది.అలాగే ఓటీటీలో కూడా కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లింది.
నవంబర్ లో దీనిని చైనాలో కూడా విడుదల చేశారు.విజయ్ సేతుపతి యాక్టింగ్, తండ్రీ కుమార్తెbల ఎమోషన్ కు అక్కడివారు సైతం కనెక్ట్ అయ్యారు.
కొన్ని కీలక సన్నివేశాల్లో కన్నీటి ఎమోషనల్ అయ్యారు.