ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు డిజాస్టర్ ఫలితాలను ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.మొన్న ఆ మధ్య మంచు పుత్ర రత్నం విష్ణు ఒక సినిమా చేసి జనాలపైకి వదిలాడు.
ఆ సినిమాలో మంచి హాట్ హీరోయిన్స్ ఉన్నారు అలాగే కామెడీ కూడా బాగానే ఉన్నా జనాలు దారుణమైన డిజాస్టర్ ఫలితాలను అంటగట్టారు.ఇక చిరంజీవి తీసిన ఆచార్య సినిమా సైతం అందుకు ఏమాత్రం తక్కువ కాదు.
చివరికి థియేటర్ మెయింటనెన్స్ ఖర్చులకు కూడా డబ్బులు రానీ షోలు పడ్డాయి.ఆ మధ్య బాలకృష్ణ తీసిన మహా నాయకుడు, మంచు మోహన్ బాబు సినిమా ఒకటి కూడా ఇలాగే డిజాస్టర్ బాట పట్టాయి.
కంగనారనౌత్ తీసిన ధాకడ్ సినిమా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది.
మన హీరోలు లేదా బాలీవుడ్ హీరోలకి ఇలా అట్టర్ ఫ్లాప్ సినిమాలు రావడం మామూలు విషయమే కానీ మలయాళం లో సినిమాలు కాస్త భిన్నంగా ఉంటాయనే టాక్ ఎప్పటినుంచో ఉంది.పైగా మన తెలుగు హీరోలు అంతా కూడా మలయాళ సినిమాలను టాలీవుడ్ లో రీమేక్ చేస్తూ ఉండటం కూడా మనం చూస్తూనే ఉన్నాం.ఇక మలయాళం లో మోహన్ లాల్ ఒక వెటరన్ హీరో అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన అలవోకగా 100 కోట్ల బిజినెస్ చేయగల దమ్మున్న హీరో.అయితే ఇంత పెద్ద స్టార్ హీరో కూడా ప్రస్తుతం ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నాడు.ప్రస్తుతం అలోన్ అనే ఒక కొత్త సినిమా చేసి జనాలపైకి వదిలాడు మోహన్ లాల్.ఇక ఈ సినిమా ఫలితం చూసిన తర్వాత అందరి ఫ్యూజులు అవుట్ అయ్యాయి.
థియేటర్లలో మొదటి రోజు జనాలు లేక అంతా వెలవెలబోయిన చివరికి ఒక నలభై నాలుగు లక్షల వసూలు అయ్యాయి.పరవాలేదులే కనీసం చాయ్ బిస్కెట్ ల ఖర్చు అయిన వచ్చింది అని సంబర పడిన, రెండవ రోజు ఆటకు ఏకంగా ఎనిమిది లక్షల పడిపోయింది.మూడవరోజు అదే పరిస్థితి… ఓవరాల్ గా మొదటి నాలుగు రోజులకు కలిపి ఒక 70 లక్షల వరకు కలెక్షన్స్ వచ్చాయి. అసలు ఈ సినిమాలో మోహన్ లాల్ ని చూసిన తర్వాత కథ వినే నటించాడా అని అనుమానం అందరిలో మొదలైంది.
ఇలాగే సినిమాలు చేసుకుంటూ వెళితే మరి కొన్ని రోజుల్లో రిటైర్ మెంట్ తప్పదు.ఇప్పటికే వయసు పైబడిన హీరో కాబట్టి త్వరగానే ఇండస్ట్రీ వీడ్కోలు పలుకుతుంది.