కరివేపాకు( Curry leaves ).నిత్యం వంటల్లో విరివిరిగా వాడుతుంటారు.
కానీ చాలా మంది వంటల్లో వేసిన కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తుంటారు.వాస్తవానికి కరివేపాకులో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.
కరివేపాకు ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అసలు ఖాళీ కడుపుతో ఐదారు కరివేపాకు ఆకులు నమిలి తింటే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.
ఇటీవల రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందిలో కంటి చూపు మందగిస్తుంది.ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.విటమిన్ ఎ లోపం వల్ల కూడా కంటి చూపు తగ్గుతుంది.అయితే ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుంది.
రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఐదారు ఫ్రెష్ కరివేపాకు ఆకులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమిలి తినాలి.ఇలా రెగ్యులర్ గా కనుక చేస్తే కళ్ళద్దాలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు.
కంటి చూపు అద్భుతంగా మెరుగుపడుతుంది.

అలాగే మధుమేహం( Diabetes ) వ్యాధిగ్రస్తులకు కరివేపాకు వరం అని చెప్పవచ్చు.రోజు ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక హెయిర్ ఫాల్ ఎందరినో తీవ్రంగా మదన పెట్టే సమస్య.
అయితే హెయిర్ ఫాల్ సమస్యను నివారించడానికి కరివేపాకు చక్కగా ఉపయోగపడుతుంది.రోజు ఉదయం కరివేపాకు తింటే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

కుదుళ్ళు దృఢంగా మారతాయి.దాంతో జుట్టు రాలడం( ( Hair fall ) తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.అంతే కాదండోయ్ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు ఆకులు తింటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.వెయిట్ లాస్ అవుతారు.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
మరియు రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.కాబట్టి, ఇన్ని ప్రయోజనాలు అందించే కరివేపాకును రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినడం అస్సలు మరవకండి.