తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శంకర్( Shankar ) లాంటి స్టార్ డైరెక్టర్ కమలహాసన్( Kamal Haasan ) లాంటి దిగ్గజ నటుడు కలిసి చేసిన భారతీయుడు 2 సినిమా( Bharateeyudu 2 ) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదనే చెప్పాలి.
నిజానికి ఈ సినిమా కంటెంట్ పరంగా ఓకే అనిపించినప్పటికి దానికి ఒక కన్ క్లూజన్ మాత్రం ఇవ్వలేకపోయారు.భారతీయుడు 2 వస్తుంది అనే అనౌన్స్ మెంట్ ఇచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను తీర్చిదిద్దలేదనే చెప్పాలి.
ఇక ఇప్పుడు భారతీయుడు 3 సినిమా కూడా రాబోతుందంటూ భారతీయుడు 2 సినిమా చివర్లో ఆ సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే భారతీయుడు 2 సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమా ఈ మంత్ ఎండింగ్ లో ఓటిటి లోకి( OTT ) వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది.
మరి ఇంత తొందరగానే సినిమా ఓటిటి లో వస్తుందా అంటూ మరి కొంతమంది తెలియజేయగా ఓటిటితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా ఈ మంత్ ఎండింగ్ కి వస్తుందని అభిప్రాయాలైతే వెల్లడవుతున్నాయి.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నెట్ ఫిక్స్ లో( Netflix ) ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక వాళ్లు భారీ మొత్తంలో డబ్బులను చెల్లించి ఈ సినిమా ఓటిటి రైట్స్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.థియేటర్ లో అంత బాగా రెస్పాన్స్ సంపాదించుకొని ఈ సినిమా ఓటిటి లో మాత్రం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి…
.