రోమ్ముపాలతో స్త్రీకి ఆ వ్యాధి ఉందో లేదో తెలుసుకోవచ్చు అంట

రొమ్ములు స్త్రీ శరీరంలో అతిగొప్ప అవయవాలు.ఇవి కామోద్రేక కేంద్రాలు అనే దృష్టితో కాకుండా, మాత్రుత్వపు అనుభవాలు పొందే అవయవాలుగా చూస్తే ఇంకా గొప్పగా కనిపిస్తాయి.

 Breast Milk Can Show The Hidden Cancer – Study-TeluguStop.com

కాని వక్షోజాలు బ్రెస్ట్ క్యాన్సర్ అనే పెద్ద ప్రమాదంలో పడటానికి అవకాశం ఉంటుందని మనం చాలాసార్లు చదువుకున్నాం.ప్రతి ఏడాది లక్షలమంది మహిళలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

అయినా బ్రెస్ట్ క్యాన్సర్ మీద మహిళలకు అవగాహన తక్కువ.ఇలాంటి వ్యాధి ఒక్కటి ఉంటుందని వచ్చేదాకా చాలామందికి తెలియదు.

అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన పెంచేందుకే సినిమా హీరోయిన్లు కొన్ని కార్యక్రామాలు నిర్వహిస్తుంటారు.దక్షిణాఫ్రికా లాంటి పెద్ద క్రికెట్ జ్జట్టు అప్పుడప్పుడు తమ గ్రీన్ కలర్ జెర్సీకి బదులు పింక్ కలర్ జెర్సీ వేసుకొని బ్రీస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకు కృషి చేస్తూ ఉంటుంది.

ఇంతలా తపన పడుతున్నారు అంటే అర్థం చేసుకొని, ఈ జేనేరేషన్ స్త్రీలకు కూడా దేశాలతో సంబంధం లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ మీద సరైన అవగాహన లేదు అని.

ఇదిలా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ని తొలిదశలోనే, కేవలం రొమ్ము పాటలతోనే కనిపెట్టవచ్చు అని ఓ సరికొత్త అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలిపారు.University of Massachusetts Amherst, US రోమ్ముపాల మీద, బ్రెస్ట్ క్యాన్సర్ మీద పలు పరిశోధనలు నిర్వహించారు.వీరు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళలు, బ్రెస్ట్ క్యాన్సర్ లేని మహిళలు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి తిరిగి నయం అయిన మహిళల నుంచి రొమ్ము పాలు సేకరించారు.

బ్రెస్ట్ క్యాన్సర్ లేని మహిళలు, నయం అయిన మహిళల పాలలో ప్రోటీన్ ఎక్స్ ప్రేషన్స్ దాదాపుగా ఒకేరకంగా ఉండగా, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో మాత్రం ఇది వేరేలా ఉంది అంట.దీనివల్ల బ్రెస్ట్ టిష్యుస్ క్యాన్సర్ బారిన ఎంతవరకు పడ్డాయో, ఎంత డ్యామేజ్ అయ్యాయో తెలిసిందట.ఈ ప్రాసెస్ ని Biochemical Monitoring అని అంటారు

ఈ బయోకెమికల్ మానిటరింగ్ ద్వారా నిప్పుల్స్ నుంచి వచ్చే ఫ్ల్యుడ్స్, సెరం, మూత్రం, ఊము, రొమ్ము పాలు, చివరకి కన్నీళ్లను కూడా పూర్తిగా గమనించవచ్చు అని, ప్రోటీన్ మార్కర్స్ సహాయంతో ఆ స్త్రీ శరీరంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయో, అవి ఏ స్టేజిలో ఉన్నాయో చాలా సులువుగా కనిపెట్టవచ్చు అని ఈ అమెరికన్ రేసేర్చేర్స్ చెబుతున్నారు.మరి ఎందుకైనా మంచిది, తల్లులు కొత్తగా బిడ్డకు పాలు పట్టేముందు ఈ బయోకెమికల్ మానిటరింగ్ పరీక్ష చేయించుకుంటే బెటర్.

ఫలితం బాగుంటే అదో ఊరట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube