తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు( Pawan Kalyan ) ఉన్నంత క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పుకోవచ్చు.ఈ హీరో ఏ సినిమా తీసినా అది బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది.
అందుకే దర్శకులు, నిర్మాతలు ఈ హీరోతో కలిసి సినిమాలు చేయాలని క్లూ కడుతుంటారు.అయితే కొందరు పవన్ ని నమ్ముకుని తమ కెరీర్ ని కూడా రిస్క్ లో పడేశారు.ఆ దర్శకులు ఎవరో తెలుసుకుందాం.
• క్రిష్ జాగర్లమూడి:

హరి హర వీర మల్లు: పార్ట్ 1( Hari Hara Veeramallu: Part 1 ) స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ మూవీ మొదలై చాలా కాలమే అవుతుంది.దీనికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.( Director Krish Jagarlamudi ) ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 2020లో ప్రారంభమైంది.ఇప్పటికే నాలుగేళ్లు గడుస్తున్నా ఈ సినిమా విడుదల కాలేదు.2022 సెప్టెంబర్ నాటికి 60% షూటింగ్ కంప్లీట్ అయింది.అప్పటినుంచి ఈ మూవీ ముందుకు కదల్లేదు.క్రిష్ ఈ సమయం అంతా ఖాళీగానే ఉన్నారు.ఓన్లీ పవన్ సినిమాకే ఆయన టైమ్ అంతా డెడికేట్ చేశారు.
ఒకవేళ పవన్‌తో సినిమా ఒప్పుకోకపోయి ఉంటే ఇప్పటికే రెండు సినిమాలు దాకా ఆయన దర్శకత్వంలో వచ్చి ఉండేవి.
పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాని పవన్ పూర్తి చేయలేకపోయారు.కానీ డైరెక్టర్ పెద్ద రిస్క్ చేసినట్లే అవుతోంది.చివరికి అతను తన కెరీర్ కాపాడుకోవడానికి ఈ మూవీ నుంచి తప్పుకున్నారు.క్రిష్ దర్శకత్వంలో దాదాపు పార్ట్-1 పూర్తయినట్లు సమాచారం.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సెకండ్ పార్ట్ ను జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయనున్నారు.
• హరీష్ శంకర్:

హరీష్ శంకర్( Harish Shankar ) కూడా పవన్ కళ్యాణ్ వల్ల తన కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్నారు.ఈ హీరోతో కలిసి హరీష్ శంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్”( Ustaad Bhagat Singh ) అనే ఓ యాక్షన్ డ్రామా మూవీ ప్రారంభించాడు.2021లో ఈ మూవీ అనౌన్స్ చేస్తే ఇప్పటిదాకా ఓన్లీ ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తయింది.ఇలా ఆలస్యం చేస్తే కష్టమని హరీష్ శంకర్ రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమాని ప్రారంభించాడు.దాన్ని త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది.ఓన్లీ పవన్ కోసమే హరీష్ మిగతా స్క్రిప్ట్స్ అన్ని హోల్డ్‌లో పెట్టారు కానీ చివరికి రిస్క్ అని వేరే సినిమాలు చేయడం ప్రారంభించారు.
• త్రివిక్రమ్ శ్రీనివాస్:

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కూడా పవన్ కోసం స్క్రిప్ట్, క్యారెక్టరైజేషన్ తదితర విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఎక్కువ సమయాన్ని ఆయనకే డెడికేట్ చేస్తుంటాడు.పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం గుంటూరు కారం సినిమాని త్రివిక్రమ్ లేట్ చేశాడనే విమర్శలు కూడా వచ్చాయి.మొత్తం మీద ఈ ముగ్గురు దర్శకులు పవన్ కారణంగా ఫైనాన్షియల్, కెరీర్ పరంగా ఎంతో కొంత నష్టపోయారని చెప్పుకోవచ్చు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.సినిమా షూటింగ్స్‌కు కొద్ది రోజుల తర్వాత వస్తానని మాట ఇచ్చారు.