ఉత్తరప్రదేశ్‌లో 5 ఏళ్ల బాలుడిపై కోతుల దాడి.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌( Uttar Pradesh )లోని మథురలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.5 ఏళ్ల బాలుడిపై అందరూ చూస్తుండగానే కోతులు దాడి చేశాయి.ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.బాలుడిని రక్షించేందుకు స్థానికులు పరుగెత్తినట్లు వీడియోలో కనిపిస్తుంది.శుక్రవారం (జులై 12న) మథురలోని వృందావనంలో ఈ సంఘటన జరిగింది.ఈ ఘటనలో గాయపడ్డ బాలుడి పేరు కిషన్.

 Monkeys Attack A 5 Year Old Boy In Uttar Pradesh Video Goes Viral-TeluguStop.com

అతడి తండ్రి గోపాల్ పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

బాలుడు సమీపంలోని ఆలయం మెట్ల దగ్గరకు చేరుకున్న వెంటనే కిషన్‌పై కోతులు( Monkeys ) దాడి చేశాయి.దాడిలో భయంతో కిషన్ ఆలయ మెట్ల నుంచి కింద పడ్డాడు.తిరిగి లేచి ఇంటి వైపు పరుగులు తీయడం ప్రారంభించాడు.

కానీ, వీధుల్లో ఉన్న ఇతర కోతులు అతనిపై దాడి చేసి, నేలపై పడేశాయి.సుమారు నాలుగు కోతులు కిషన్‌ను లాగి, ఈడ్చివేయడానికి ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తుంది.

దాడి సమయంలో కోతులు అతన్ని కొట్టి, నేలపైకి నెట్టాయి.ఈ దాడిలో కిషన్‌కు గాయాలు అయ్యాయి.

అతనికి చికిత్స అందిస్తున్నారు.

దాడి సమయంలో అక్కడ కొంతమంది మహిళలు ఉన్నా, వాళ్ళు బాలుడిని కాపాడేందుకు ధైర్యం చేయలేదు.కొంతసేపు కోతులు బాలుడిని లాగి, కొడుతూనే ఉన్నాయి.చివరికి, కొంతమంది యువకులు పరుగున వచ్చి బాలుడిని రక్షించారు.

వాళ్లు కోతులను బెదిరించగా, కోతులు బాలుడిని వదిలి పారిపోయాయి.రక్షించబడిన తర్వాత బాలుడు వేగంగా లేచి ఇంటి వైపు పరుగులు తీశాడు.

మనుష్యులు, జంతువుల మధ్య ఇలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి.చాలా మంది పిల్లలు ఇలాంటి దాడులకు బలవుతున్నారు.

కోతులు, కుక్కలు వంటి జంతువులు వాళ్ళపై దాడి చేస్తున్నాయి.ఇటీవలే ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో రెండు ఎద్దులు దుకాణంలోకి దూరి పోట్లాడుకున్నాయి, అక్కడ ఉన్న ఇద్దరు మహిళలు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

ఆ దుకాణంలో జంతువులు వాళ్ళను తొక్కుతూ ఉండటం వీడియోలో కనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube